ట్రంప్ గడిపేది 3 గంటలు..చేస్తున్న ఖర్చు షాక్

August 08, 2020

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు టైం దగ్గరకు వచ్చేస్తుంది. ఆయన పర్యటన ఓ రేంజ్లో సాగాలని భావిస్తున్న మోడీ సర్కారు.. ఖర్చు గురించి అస్సలు ఆలోచించటం లేదు. విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్ లో కొత్తగా నిర్మించిన స్టేడియం వరకున్న 22 కిలోమీటర్ల దారి పొడుగునా ప్రజలు ట్రంప్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తనకు స్వాగతం పలికే వారి గురించి మోడీ చెప్పిన గొప్పల్ని అదే పనిగా చెప్పిన ట్రంప్ మాటలపై విస్మయం వ్యక్తమైంది.
తనకు 70 లక్షల మంది స్వాగతం పలుకుతున్నట్లుగా ట్రంప్ చెప్పగా.. అదేమీ లేదని ఒకట్రెండు లక్షల మంది మాత్రమే 22 కి.మీ. మేర స్వాగతం పలికేలా ఏర్పాట్లు సాగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. అహ్మదాబాద్ నగర జనాభానే 60 లక్షలు అని.. అలాంటప్పుడు 70 లక్షల మంది ట్రంప్ కు ఎలా స్వాగతం పలుకుతారని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అహ్మదాబాద్ లో ట్రంప్ ఉండే మూడు గంటల కోసం అక్కడి ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఇప్పుడు అవాక్కు అయ్యేలా చేస్తోంది.
ట్రంప్ రాక సందర్భంగా రోడ్ల మరమ్మత్తులు.. నగర సుందరీకరణ కోసం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అతి పెద్ద క్రికెట్ స్టేడియం అయిన మోతేరా స్టేడియంను ప్రారంభించిన తర్వాత ట్రంప్ తిరిగి వెళ్లే విమానాశ్రయం మార్గాన్ని పెద్ద ఎత్తున బాగు చేస్తున్నారు. ఇందుకోసం 17 కొత్త రోడ్లతో పాటు.. కొత్తగా ఒకటిన్నర కిలోమీటర్ల మేర రోడ్డు వేయానికే రూ.60 కోట్లను ఖర్చు చేయటం గమనార్హం. మూడు గంటల పాటు సాగే ట్రంప్ పర్యటన కోసం ఇంత భారీ ఖర్చా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మొత్తం గుజరాత్ బడ్జెట్ లో 1.5 శాతం ఈ మూడు గంటల ట్రంప్ పర్యటన కోసం ఖర్చుచేస్తుండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

అయినా ఏపీ ముఖ్యమంత్రి చేసిన తప్పులకు జైలుకు ఒక్కరోజు వెళ్లిరావడానికి 60 లక్షలు ఖర్చయినపుడు అన్ని మౌలిక సదుపాయాలకు అన్ని కోట్లు అవడం పెద్ద విషయం కాదేమో మరి.