భారీ ప్యాకేజీతో గుడ్ న్యూస్ చెప్పేసిన కేంద్రం

August 08, 2020

కరోనా వేళ.. ఇరవై ఒక్కరోజుల పాటు కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో..దేశంలోని లక్షలాది మంది నిరుపేదల జీవనం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికే లాక్ డౌన్ వేళ.. బడుగుజీవి బతుకుబండి ఎలా సాగుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. అలాంటి వాటిపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదంటూ.. కేంద్రం భారీ ప్యాకేజీని ప్రకటించింది. రూ.1.7లక్షల కోట్లతో కూడిన ప్యాకేజీని కేంద్ర ఆర్థికమంత్రిక నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఈ పథకం కింద దేశవ్యాప్తంగా కరోనా వేళ.. ఎలాంటి ఆకలి చావులు ఉండకూడదన్న లక్ష్యంతో ఈ ప్యాకేజీని రూపొందించారు. రోజువారీ అవసరాలకు సాయంగా గరీబ్ కల్యాణ్ స్కీం పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించారు. వలస కార్మికులు.. పట్టణ.. గ్రామీణ పేదల్ని ఆదుకునేలా ఈ ప్యాకేజీ ఉంది. అన్నింటి కంటే ముఖ్యం.. కరోనా వైరస్ పై యుద్ధం చేస్తున్న వైద్యులు.. నర్సులు.. పారామెడికల్  సిబ్బంది.. శానిటేషన్ వర్కర్లకు ఒక్కొక్కరికి రూ.50లక్షల చొప్పున ప్రత్యేక బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ ప్యాకేజీ ద్వారా 63 లక్షల స్వయం సహాయక గ్రూపులకు.. దేశ వ్యాప్తంగా 20 కోట్ల మంది మహిళలకు మేలు జరుగుతుందన్నారు. ఉపాధిహామీ వేతనాలు రూ.182 నుంచి రూ.202కుపెంచుతున్నట్లు చెప్పారు. ఉజ్వల పథకం కింద లబ్థిదారులకు మూడు గ్యాస్ సిలిండర్లు.. రూ.15వేల లోపు జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందా కేంద్రమే భరించనుంది. ఉద్యోగి వాటా 12 శాతం.. యజమాని వాటా తొమ్మిది శాతం కలిపి ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల్లో ప్రభుత్వమే జమ చేయనున్నట్లు చెప్పారు. వందమంది లోపు ఉద్యోగులు ఉన్న సంస్థలకు ఈ పథకం వర్తించనుంది.

 ఆర్థికమంత్రి ప్రకటించిన భారీ ప్యాకేజీలోని కీలక అంశాలివే..

* కరోనా ప్యాకేజీ కింద పేదలకు 1.7 లక్షల కోట్ల సహాయం
* ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద సహాయం
* కరోనా కేసుల్లో పని చేస్తున్న ఆరోగ్య సహాయకులకు 50 లక్షల ఆరోగ్య భీమా
* 3 నెలలపాటు 80 కోట్ల మందికి రేషన్‌ ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్‌ యోజన్‌ ద్వారా
* మరో 5 కేజీల బియ్యం లేదా గోధుమలుఇప్పటికే ఇస్తున్న 5 కేజీలకు అదనం
* కేజీ పప్పు సరఫరా చ
* పేదల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ
* పీఎం కిసాన్‌ కింద ఇప్పటికే రైతులకు ఏడాదికి రూ.6వేలు ఇస్తున్నాం
* మొదటి విడతగా రూ.2వేలు వెంటనే రైతుల ఖాతాల్లో జమ
* ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే రోజువారీ వేతనం రూ.202కు పెంపు
* వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు రెండు విడతలుగా రూ.వెయ్యి
* జన్‌ధన్‌ అకౌంట్‌ ఉన్న మహిళలకు నెలకు రూ.500 చొప్పున 3 నెలలపాటు
* ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు
* డ్వాక్రా గ్రూపులకు ష్యూరిటీ లేకుండా రుణాలు
* డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు
* ప్రావిడెంట్‌ ఫండ్‌ ఉద్యోగుల వాటాను కేంద్రమే చెల్లిస్తుంది
* 90 శాతం మంది ఉద్యోగులు రూ.15వేల కంటే తక్కువ జీతం ఉన్న కంపెనీలకు ఇది వర్తింపు
* తమ పీఎఫ్‌ డబ్బు నుంచి 75శాతం విత్‌డ్రా చేసుకునే అవకాశం
* భవన నిర్మాణ కార్మికుల కోసం రూ.31వేల కోట్లు కేటాయింపు
* రాష్ట్రాలకు కేటాయించిన మినరల్‌ ఫండ్‌ను కరోనా వైద్య పరీక్షల కోసం వాడుకోవచ్చు