వైసీపీ చెప్పిన పచ్చి అబద్ధం.... 

June 03, 2020

ఎలాంటి సందర్భాన్ని అయినా పబ్లిసిటీకి వాడుకోవడంలో వైసీపీ పార్టీ ఏ మాత్రం మొహమాట పడదు. అయినా... శ్మశానానికి రంగులేసినపుడే ఆ పార్టీ మనస్తత్వం ప్రజలకు అర్థమైపోయింది. తాజాగా ఒక పచ్చి అబద్ధాన్ని విపరీతంగా అధికారికంగా ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు.... హెల్త్ ఎమర్జెన్సీని పబ్లిసిటీకి వాడుకుంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి. టెస్టింగ్ కిట్లను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి అంటూ ఇంటర్నెట్లో ఫొటోలు వైరల్ చేస్తున్న జగన్ పై జనం విమర్శలు చేస్తున్నారు. మీ గొప్పలకు ఇదా సందర్భం అని ప్రశ్నిస్తున్నారు. మొన్న ఆస్పత్రిలో బెడ్లను ప్రారంభించేందుకు రిబ్బన్ కట్ చేసిన మంత్రులను చూశాం. అంతకుముందు మార్కెట్లో డిసిన్ఫెక్టింగ్ ఎంట్రన్స్ కి బెలూన్లు కట్టి సంబరాలు చేస్తున్నదీ చూశాం. తాజాగా జగన్ కిట్లను ఆవిష్కరించడం అందరినీ విస్మయ పరిచింది. అన్ని స్టేట్స్ లో కిట్స్ వచ్చాయి. ఎవరూ ఆవిష్కరించలేదు జగన్ తప్పు. ఇది ఆయన ఆలోచనా స్థాయి. సరే ఈ పబ్లిసిటీ పిచ్చి పక్కన పెడితే... వైసీపీ ప్రచారం చేస్తున్న అబద్ధం... దాని వెనుక ఉన్న నిజం తెలుసుకుందాం.

 

వైసీపీ అబద్ధం :

దక్షిణ కొరియా నుంచి చార్టర్ ఫ్లైట్లో ఏపీకి లక్ష కోవిడ్ కిట్లను ప్రత్యేకంగా తెప్పించిన జగన్.  

వాటిని ప్రారంభిస్తున్న జగన్ !

ఇది వాస్తవం :

కార్గో విమానాలు తప్ప ఏవీ ఏ దేశాల మధ్య నడవడం లేదు.

ప్రస్తుతం కేవలం కేంద్రం ఆధ్వర్యంలో ఫ్లైట్లు నడుస్తున్నాయి

ఏ చార్టర్ విమానాలను ప్రభుత్వం అనుమతించడం లేదు.

వారం క్రితం కేంద్రం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేస్తూ రాష్ట్రాలు స్వతంత్రంగా ఏవీ ప్రొక్యూర్ చేయొద్దు. మేమే చేస్తాం అని చెప్పింది.

తాజాగా ఈరోజు భారీ సంఖ్యలో కిట్లను తెప్పించి అన్ని రాష్ట్రాలకు పంపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. 

అంటే కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఈరోజు కిట్లను సరఫరా చేసింది. అందులో ఏపీకి కూడా పంపింది. వాటినే జగన్ ప్రారంభించారు. (పబ్లిసిటీ... ఇది పబ్లిసిటీ )

అసలు వైసీపీ ఎందుకు అబద్ధాలు అంత నమ్మకంగా ప్రచారం చేస్తుందో తెలుసా... వారు ప్రచారం చేసేవి అబద్ధాలు అని ప్రతిపక్షాలు కనిపెట్టేలోపు అది ఎంతో మంది అమాయకులకు చేరిపోతుంది.  అమాయకులు విమర్శలను పట్టించుకోకుండా గుడ్డిగా నమ్మేస్తారు... ఆ మాత్రం ప్రయోజనం చాలు అని వైసీపీ భావిస్తుంది. మళ్లీ ఆ అబద్ధం నమ్మిన అందరికీ ప్రతిపక్షం వాస్తవాన్ని చేర్చడం కూడా కష్టం కావొచ్చు.