వైసీపీని దెబ్బేసేది అదే...

August 13, 2020

వైసీపీ శత్రువు బీజేపీ కాదు

వైసీపీ శత్రువు టీడీపీ కాదు

వైసీపీ శత్రువు జనసేన కాదు

వైసీపీ శత్రువు ఆ పార్టీ ఓవర్ కాన్పిడెన్స్. 

ఇది మళ్లీ మళ్లీ ప్రూవ్ అవుతోంది. 

కొద్ది రోజుల క్రితం నమస్తే ఆంధ్ర ఒక వార్త (( టెన్త్ క్లాస్ - ఏపీ మంత్రి సంచలన కామెంట్స్ )) రాసింది. అందులో మేం చర్చించింది ఏంటంటే... టెన్త్ క్లాస్ పరీక్షలు జరిపి తీరుతాం అన్న మంత్రి ఆదిమూలపు సురేష్ కామెంట్స్ పార్టీ పరువు తీస్తాయన్న  అభిప్రాయం వెలిబుచ్చాం.

పరిస్థితులు అంచనావేయకుండా తాము అనుకున్నది జరిగి తీరుతుందని ప్రతిసారి అనుకుని జగన్ గవర్నమెంటు బోల్తాపడుతోందని, పరిస్థితులు ఎవరి చేతుల్లో ఉండవని... కచ్చితంగా టెన్త్ పరీక్షలు వాయిదా పడతాయన్న అభిప్రాయాన్ని నమస్తే ఆంధ్ర.కాం వెలిబుచ్చింది.

ఒకవైపు కరోనా పెరుగుతూ ఉంటే పరీక్షలు పెట్టడం సాధ్యం కాదని, చివరకు కోర్టుల ద్వారా అయినా, ప్రముఖుల సలహాతో అయినా ఆగిపోతాయని చెప్పాం. లేదు మేం పరీక్ష జరిపి తీరుతాం అన్నారు. చివరకు అదే జరుగుతోంది.

ఈ సాయంత్రం టెన్త్ క్లాస్ పరీక్షలు రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందరినీ పాస్ చేస్తున్నట్లు చెప్పింది. నిమ్మగడ్డ, వైసీపీ రంగుల్లో కూడా కోర్టుల్లో ఇబ్బందులు వస్తాయని ఎవరు చెప్పినా వినలేదు. చివరకు అనుకున్నట్టే వెనక్కు తగ్గాల్సి వచ్చింది. టెన్త్ క్లాస్ లోను వైసీపీ తన పరువును తీసుకుంది.

ఆరోజు అన్ని ప్రగల్బాలు పలకడం ఎందుకు? ఇపుడు రద్దు చేయడం ఎందుకు? ప్రజాభిప్రాయమే పరమావధిగా పాలన సాగితే ప్రభుత్వాలకు ప్రజల మద్దతు దొరుకుతుంది. లేకుంటే ఇబ్బందికరమైన పరిస్తితులు వస్తాయి. మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. కాలు జారితే తీసుకోగలం గానీ నోరు జారితే తీసుకోలేం కదా.

వైసీపీ నాయకులు కాస్త ఓవర్ కాన్పిడెన్స్ తగ్గించుకుంటేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. ఎవ్వరి మాట వినకపోతే జరగాల్సింది జరుగుతుంది.