రెండు కొత్తరకం ‘జరిమానా‘లు వేస్తున్నాం- కేసీఆర్

May 28, 2020

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్ లు తప్ప మిగతా తెలంగాణ మొత్తాన్ని కేసీఆర్ గ్రీన్ జోన్ గా ప్రకటించారు. అన్ని రకాల వ్యాపారాలకు అనుమతి ఇచ్చేశారు. కేసులున్నాయి.... కానీ వ్యాపారాలు చేసుకోక తప్పదు. అన్ని వ్యాపారాలు చేసుకోండి అని ప్రకటించిన కేసీఆర్... కేంద్రం బంద్ చేసిన వాటిని బంద్ లోనే ఉంచారు.

అయితే, మాస్కు లేకుండా మనిషి కనిపిస్తే 1000 రూపాయలు ఫైన్ వేస్తారు

ఆటోలో 1+2, కారులో 1+3 కి మించి ప్రయాణించడానికి వీల్లేదు. అంతకంటే ఎక్కువ ప్రయాణిస్తే చలానా రాస్తారు.

ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ట్రాఫిక్ ఫైన్లకు ఇవి అదనం అన్నమాట. కేసీఆర్ కోసం కాకపోయినా మన కోసం మనం జాగ్రత్త తీసుకుందాం. అందరూ ఆరోగ్యంగా ఉందాం. ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తే మళ్లీ కేసులు పెరుగుతాయి. కేసులు పెరిగితే మళ్లీ పూర్తి లాక్ డౌన్ వస్తుంది. మళ్లీ మన వ్యాపారాలు దెబ్బతింటాయి. 

వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎవరి జాగ్రత్తలో వారుండటం మంచిది. మీ ఆరోగ్యానికి మీరే రక్ష. నిర్లక్ష్యం చేస్తే మీ కుటుంబానికి మీరే శిక్ష.

కేంద్రం అవకాశం ఇచ్చినా... ఇతర రాష్ట్రాలకు బస్సులు నడపడానికి కేసీఆర్ అంగీకరించలేదు. హైదరాబాదులో సిటీ బస్సులుండవు. హైదరాబాదులో షాపులకు సరి బేసి విధానం ఉంటుంది. దానిని బట్టే ఓపెన్ చేయాలి. రేపటి నుంచి తెలంగాణ మొత్తం బస్సులు తిరుగుతాయి.