‘118’ మూవీ రివ్యూ

December 06, 2019

బ్యానర్‌: ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌

న‌టీన‌టులు: నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, షాలిని పాండే, నివేదా థామ‌స్, నాజ‌ర్‌, ప్ర‌భాస్ శ్రీను, అశోక్ కుమార్‌, రాజీవ్ క‌న‌కాల, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ త‌దిత‌రులు

మాట‌లు: మిర్చి కిర‌ణ్‌

సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌

పోరాటాలు: వెంక‌ట్‌, అన్బ‌రివు, రియ‌ల్ స‌తీశ్‌

కూర్పు: తమ్మిరాజు

నిర్మాత‌: మ‌హేష్ కొనేరు

క‌థ‌, ఛాయాగ్ర‌హ‌ణం, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: కె.వి.గుహ‌న్‌

 

పలు వైవిధ్య భరితమైన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న నందమూరి కళ్యాణ్ రామ్.. ఈ సినిమా ద్వారా మరో డిఫెరెంట్ కథాంశంతో  ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయింది. టైటిల్ అనౌన్స్ చేయ‌గానే.. భ‌లే ఉందే! అనుకున్నారంద‌రూ. అస‌లు 118 అంటే ఏంటి? స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో క‌ల్యాణ్ రామ్ చేసిన 118 త‌న‌కు విజ‌యాన్ని అందించిందా? అంచనాలను అందుకుందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

 

క‌థ

గౌతమ్‌ (కల్యాణ్ రామ్‌) అనే కుర్రాడు ఓ ఛానెల్ లో ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ గా పని చేస్తుంటాడు. ఏ పనైనా మొదలుపెడితే మధ్యలో వదిలేసే అలవాటులేని గౌతమ్‌ను ఓ కల బాగా డిస్ట్రబ్‌ చేస్తుంటుంది. కలలో ఓ అమ్మాయిని ఎవరో తీవ్రంగా కొట్టడం, ఓ కారును పెద్ద కొండ మీదనుంచి చెరువులో పడేయటం లాంటి సంఘటనలు కనిపించటంతో షాకైన గౌతమ్‌.. ఆ కల గురించి ఎలాగైనా తెలుసుకోవాలనుకుంటాడు. తనకు కలలో కనిపించిన అమ్మాయి నిజంగా ఉందా? అని, ఆమెను వెతికే పనిలో పడతాడు గౌతమ్. ఈ ప్రయత్నంలో గౌతమ్‌కు కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. అస‌లు ఆ క‌ల ఏంటి? ఎందుకు వ‌చ్చింది? క‌ల‌లో ఉన్న అమ్మాయి ఎవ‌రు? ఆ అమ్మాయిని ఎవరు, ఎందుకు కొట్టారు? ఈ మిస్టరీని గౌతమ్ ఎలా సాల్వ్‌ చేశాడు? అనేదే సినిమా కథ.

 

సినిమా ఎలా ఉందంటే

తన కలలో కనిపించిన అమ్మాయి కోసం వెతికే పనిలో గౌతమ్ ఎదుర్కొన్న సవాళ్లు ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఇంట‌ర్వెల్ ముందు క‌థ అంతా ఆస‌క్తిక‌రంగానే అనిపించింది.. కానీ ఇంట‌ర్వెల్ త‌ర్వాత సినిమా  కాస్త నెమ్మదించినట్లు అనిపించింది. ఇంట్రస్టింగ్ పాయింట్‌ తో సినిమాను ప్రారంభించిన దర్శకుడు ఎంగేజింగ్‌ స్క్రీన్‌ప్లేతో ఆడియన్స్‌ను కట్టిపడేశాడని చెప్పుకోవచ్చు.  ప్రీ క్లైమాక్స్‌కు వచ్చే సరికి పూర్తిగా లాజిక్‌ను పక్కన పెట్టి తెరకెక్కించిన సన్నివేశాలు అంత కన్విన్సింగ్‌గా అనిపించవు. సినిమాటోగ్రఫి పరంగా మాత్రం గుహన్ ఫుల్‌ మార్క్స్‌ సాధించాడు. స్టైలిష్‌ టేకింగ్‌తో మెప్పించాడు.

 

సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌

సినిమాకు ప్రధాన బలం నేపథ్య సంగీతం. ప్రతీ సీన్‌ను తన మ్యూజిక్‌తో మరింత ఎలివేట్ చేశాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ శేఖర్‌ చంద్ర. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా హైలైట్ గా నిలిచాయి. టేకింగ్ లో డిఫెరెంట్ ఫీలింగ్ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు.

 

బలాలు

కల్యాణ్‌ రామ్‌, నివేదా థామస్‌ యాక్టింగ్

ఎంచుకున్న పాయింట్ 

 

బలహీనతలు

- లాజిక్‌ లేని కొన్ని సీన్స్‌

- సెకండాఫ్ 

 

మొత్తంగా: ‘118’ థ్రిల్ చేసింది

 

రేటింగ్: 3.5/ 5