మొదటి లాక్ డౌన్ తో పోయిన ఉద్యోగాలెన్ని?

August 14, 2020

కరోనా తీసే ప్రాణాల కన్నా ఉద్యోగాల సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా వస్తే బతుకుతామన్న గ్యారంటీ ఉంది గాని కరోనా మనకు రాకపోయినా అది ఇండియాలో ఉంటే బతుకుతామని గ్యారంటీ లేదు. అదే విచిత్రం. కరోనా వల్ల గవర్నమెంటు పెట్టిన తొలి లాక్ డౌన్ 21 రోజులు. ఈ మొదటి లాక్ డౌన్ వల్ల దేశంలో 12 కోట్ల ఉద్యోగాలు పోయినట్లు అంచనా. ఇది దేశానికి వచ్చిన అతిపెద్ద కష్టమని... దీనిని ఎదుర్కోవడంలో  కేంద్రం సరైన రీతిలో ముందుకు పోవడం లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోపించారు. 

మొదటి దశలో ఉద్యోగాలు కోల్పోయిన వారు వివిధ రంగాల్లో దినసరి ఆదాయంపై పనిచేసేవారే. నిర్మాణ రంగంలో ప్రతి ఉద్యోగం పోయిందన్నారు. దేశంలో అత్యధిక మందికి ఉపాధినిచ్చే రంగం ఇదే అని సోనియాగాంధీ చెప్పారు.  

రాజకీయాలు పక్కన పెట్టి దేశం కోసం ఆలోచించి మేథోమధనం తర్వాత మంచి సలహాలు ఇచ్చాం. వాటిని కూడా కొన్నే తీసుకున్నారు. ఇలాంటి సమయంలో సమష్టిగా పోరాడాలి. ప్రతి పేద కుటుంబానికి ఇపుడు 7500 రూపాయలు పంచాలి. ప్రపంచంలో పలు దేశాలను గమనించిన తర్వాత అయినా వాస్తవాలు అర్థం చేసుకోవాలి. లాక్ డౌన్ తో వ్యవస్థలన్నీ ఆగిపోయాయి. కరోనా వల్లే కాదు ఆకలి వల్ల కూడా చావకుండా చూసుకోవాలి. 

మనం దీని నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం. చాలా వేగంగా టెస్టులు జరపాలి. కాంటాక్టులను ట్రేస్ చేయాలి. క్వారంటైన్ చేయాలి. ఇంతకుమించి మన దగ్గర మంచి ఆయుధం లేదు అని సోనియా పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చాలా అలసత్వం ప్రదర్శిస్తోందని... దీనివల్ల మరింత నష్టం జరుగుతుందని కాంగ్రెస్ అభిప్రాయపడింది.