ముహూర్తం : ఏప్రిల్ 13 ఎవ‌రికి మంచిది?

July 20, 2019

పంచాంగం
చైత్ర మాసం
ఏప్రిల్ 13, శని వారం

తిథి-
అష్టమి (మంచి తిథి కాదు) ఉదయం 11.41 వరకు, అనంతరం నవమి (మంచి తిథి కాదు)

గమనిక - ఈ నవమి శ్రీరామ నవమి. భారతీయ పండుగ. అయినా కూడా ముహూర్తాలకు రెకమెండెడ్ కాదు. (పండుగ రేపు)

న‌క్ష‌త్రం -
పునర్వసు ఉద‌యం 8.59 వరకు, అనంత‌రం పుష్యమి న‌క్ష‌త్రం.

దుర్ముహూర్తాలు –

దుర్ముహూర్తం – ఉదయం 06:06 నుంచి 07:45 వరకు

రాహుకాలం – ఉదయం 09:11 నుంచి 10:44 వరకు
య‌మ‌గండం – మధ్యాహ్నం 13:50 నుంచి 15:23 వరకు

వ‌ర్జ్యం- సాయంత్రం 16:33 నుంచి 18:04 వరకు

సుముహూర్తం
సాయంత్రం 18.09 నుంచి 19.23 వరకు

న‌క్ష‌త్ర బ‌లం –
* శని వారం ఉద‌యం 8.59 వరకు
భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, అశ్లేష, పూర్వ ఫల్గుణి, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ట, పూర్వాషాడ, శ్రవణ, శతభిష, ఉత్తరా భధ్ర, రేవతి నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.

* శని వారం ఉద‌యం 9.00 తర్వాత
అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, అశ్లేష, మఖ, ఉత్తర ఫల్గుణి, చిత్త, విశాఖ, జ్యేష్ట, మూల, ఉత్తరాషాడ, ధనిష్ట, పూర్వాభధ్ర, రేవతి నక్షత్రాల్లో పుట్టిన వారికి శుభకరం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.