గ్యాంగ్ వార్ (బెజవాడ) - అరెస్టయ్యింది వీరే

August 13, 2020

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విజయవాడ గ్యాంగ్ వార్ లో సందీప్ మృతి అనేక సంచలనాలకు కారణమైంది. రోజురోజుకు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 13 మందిని అరెస్ట్ చేసినట్టు విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. 

కొత్త ట్విస్టు ఏంటంటే...  గతంలో సందీప్ మీద రౌడీషీట్ ఉండేదని తెలిసింది. 2016లో హైకోర్టు ఓ తీర్పు ఇచ్చాక రౌడీషీట్ ఎత్తివేసినట్టు చెప్పారు. సందీప్ మీద ఇప్పటివరకు 13 కేసులు, పండు మీద 3 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇరువైపులా  రెండు గ్యాంగ్‌ల్లోనూ చదువుతున్న వారు కూడా ఉన్నారు. ఈ గ్యాంగ్ ఇప్పటిది కాదని... చాలా కాలం నుంచి కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఒక్క  విద్యార్థి మాత్రమే గ్యాంగ్ లో ఉన్నారు. మిగతా వారంతా చదువు పూర్తయిన వారు. రేపల్లె ప్రశాంత్ అనే యువకుడు ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు.

​ఇదిలా ఉండగా ​తోట సందీప్ హత్య కేసులో అరెస్టైన నిందితుల​ వివరాలను పోలీసులు వెల్లడించారు. ఇదిగో ఆ జాబితా. 

 

రేపల్లె ప్రశాంత్​​

రవితేజప్రేమ్ కుమార్

వెంకటేష్

బాషా

సంతోష్

ఎర్ర తిరుపతిరావు

ఓరుగంటి దుర్గా ప్రసాద్

ఓరుగంటి అజయ్​