ఐ.టి శాఖ ముఖ్య కార్యదర్శి అనూప్ సింగ్ బదిలీ వెనక 1350 కోట్ల స్కాం?

May 29, 2020

నిజాయితీ అధికారి అయ్యిన ఐ.టి శాఖ ముఖ్య కార్యదర్శి అనూప్ సింగ్ బదిలీ వెనక 1350 కోట్ల స్కాం...సర్వే ఆఫ్ ఇండియాని కాదని, చైనా కంపెనీకి అప్పచెప్పే ఆలోచనలో వై.సి.పి ప్రభుత్వం.

వై.సి.పి ప్రభుత్వం భూముల సమగ్ర సర్వే చేయడానికి సిద్ధమయ్యింది. దీనికోసం 1850 కోట్లు ఖర్చు అవుతుందని సర్వే శాఖ కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది..ఈ విషయం తెలిసి సర్వే ఆఫ్ ఇండియా సమగ్ర సర్వే చేయడానికి ముందుకు వచ్చింది...కేవలం 500 కోట్లతో సర్వే తో పాటు, 5 సంవత్సరాలు రికార్డుల నిర్వహణ కూడా చేస్తాం అని చెప్పారు. అవసరం ఐతే ఒకటి లేదా రెండు గ్రామాలు పైలట్ సర్వే చేపడుతామని, ఆ ఫలితాలను చూసి నిర్ణయం తీసుకోమన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థకు సర్వే అప్పచెబితే మనకి వచ్చే ఆదాయాల మాటేంటి అనుకొన్న ప్రభుత్వ పెద్దలు, ముఖ్య అధికారులు...ఎంతో అనుభవం ఉన్న ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియా ప్రతిపాదనని పక్కన పెట్టి, సొంతంగా సర్వే చేసేవిధంగా రోవర్ల కొనుగోలుకి సిద్ధపడినది. దీనికి కావలిసిన ప్రతిపాదనను స్వతహాగా నిజాయితీ పరుడు అయ్యిన ఐ.టి శాఖ కార్యదర్శి అనూప్ సింగ్ దగ్గరకి పంపగా, ఆయన 1850 కోట్ల కొనుగోలు ఫైల్ ని రిజెక్ట్ చేయడంతో...దిక్కు తోచక రెవెన్యు శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్, ఆ శాఖ మంత్రితో, జగన్ సలహాదారుడు అజయ్ కలామ్ తో మాట్లాడి అనూప్ సింగ్ ని బదిలీ చేయించారు.

అనూప్ సింగ్ బదిలితో ఉన్న అడ్డంకి తొలిగి పోయింది...దీనితో ముందుగా అనుకొన్న ప్రకారం 1850 కోట్ల పనిని ఇండియాలో అనుభవం లేని చైనా కంపెనీకి అప్పనంగా Hexagon Geosystems కి నేడో, రేపో అప్పచెప్పడానికి సిద్ధపడ్డారు.

5 లక్షలు మాత్రమే విలువచేసే రోవర్ ని (CORS GR30 Model) 12.5 లక్షలకి కొనడానికి సిద్ధం అయ్యారు. పోలవరంలో రివర్స్ టెండరింగ్ అని నీతులు చెప్పే జగన్ మోహన్ రెడ్డి, 500 కోట్లతో సమగ్ర సర్వే చేయడానికి సిద్ధం అయ్యిన సర్వే ఆప్ ఇండియాకి అప్పచెప్పకుండా....అనుభవం లేని చైనా కంపెనీ దగ్గర 1850 కోట్లు పెట్టి అధిక ధరతో రోవర్లు కొనడము ఏమిటి అని, ప్రభుత్వ అధికారులు చెవులు కొరుకొంటున్నారు.

ఈ టెండర్ ద్వారా కోట్లాది రూపాయలు ప్రభుత్వ పెద్దలు, రెవెన్యూ శాఖా మంత్రి, ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్, సర్వే డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి..తదుపరులకి అందనున్నాయి. ఈ విషయంలో మొదటి నుంచి అన్నీ తనయ్యి ముందుకు నడిపించిన వ్యక్తి సర్వే డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి.

 

RELATED ARTICLES

  • No related artciles found