షాక్ కు గురిచేసిన జగన్ నిర్ణయం !!

February 27, 2020

ఏపీ ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలం అవుతోంది అని ఇన్నాళ్లు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటే... కొత్త ప్రభుత్వం, అపుడే విమర్శలు ఏంటి అని జనం పట్టించుకోలేదు. కానీ ఈరోజు జనానికి కూడా స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి అసమర్థత స్వయంగా అర్థమైంది. 

గోదావరిలో దేవిపట్నం వద్ద... అత్యంత ప్రమాదకరమైన వాతావరణంలో బోట్లను తిప్పుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిండంతో అనేక ప్రాణాలు పోయాయి. మొదటి పది పదిహేను మంది చనిపోయారు అనుకుంటే అది 40 దాటేలా ఉంది. అత్యంత శోచనీయమైన విషయం ఏంటంటే... ప్రమాదం జరిగి 7 రోజులుగా గడిచినా ప్రభుత్వం మృతదేహాలను అన్నిటినీ వెలికితీయలేకపోయింది. కేవలం 250 అడుగుల లోతున ఉన్న బోటును పైకి తీసుకురాలేకపోయారు ప్రభుత్వ సిబ్బంది. సర్కారు నడిపే నాయకుడి అసమర్థత కారణంగా ఈ దారుణమైన పరిస్థితి ఏర్పడిందని ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ చేసిన తాజా పని... సామాన్యులకు కూడా జగన్ పై ఈసారి గట్టి అనుమానాలను క్రియేట్ చేసింది.

బోటు మునిగిపోయిన చోటులో 144 సెక్షన్ విధించారు. ఇది తెలిసిన వారు షాక్ తిన్నారు. బోటు మునిగిపోయిన చోట 144 సెక్షన్ ఏంటి సామీ... బుర్రలో మీకేమయినా పురుగు కుట్టిందా అని చీవాట్లు పెడుతున్నారు. ఎలాగూ ప్రమాదం నివారించలేకపోయారు. కనీసం చనిపోయిన వారిని చివరి చూపు చూసుకునే అవకాశం ఇవ్వండి, మా వాళ్ల శవాలు అయినా ఇవ్వండి అంటూ బాధిత బంధువులు కన్నీరు కారుస్తున్నారు. శవాలు తీయడం చేతకాకపోతే కనీసం క్షమాపణ చెప్పి ఇక వెళ్లిపోమని చెప్పకుండా 144 సెక్షన్ విధించి అక్కడికి వస్తే  లాఠీలతో కొడతాం అని అనడం అంటే... ఎంత నీచం, ఎంత దుర్మార్గం ఇది? ఎంత పాపం ఇది? ప్రాణాల పట్ల మరీ ఇంత నిర్లక్ష్యమా? విపత్తు నిర్వహణలో ఇంత వైఫల్యమా? అంటూ జనం జగన్ తీరును విమర్శిస్తున్నారు. 

గవర్నమెంటే రమ్మని చెప్పి ముఖ్యమంత్రిని జనం కలవకుండా 144 సెక్షన్ పెట్టారు. మొన్న నరసరావుపేటలో కోడెల చనిపోతే అక్కడ 144 సెక్షన్ విధించారు. ఇపుడు పడవ ప్రమాద బాధిత కుటుంబాలు అక్కడికి రాకుండా 144 సెక్షన్ పెట్టారు. దీనిపై నెటిజన్లు అన్ ఫిట్ సీఎం అంటూ ట్రోల్ చేస్తున్నారు.