బాబు దెబ్బకు రాయ‌ల‌సీమ‌లో 15 ఎమ్మెల్యేలు అవుట్‌

May 25, 2020

వాస్త‌వం మాట్లాడుకుంటే… ఏ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా నాయ‌కుల‌ను బ‌ట్టి రాష్ట్ర అభివృద్ధిలో మార్పు పాజిటివ్ లేదా నెగెటివ్ ఉంటుంది. కానీ నియోజ‌క‌వ‌ర్గాల రాజ‌కీయాలు మాత్రం ఏ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా మార‌వు. ఎవ‌రు ఎమ్మెల్యే అయినా వారి ధ్యేయం సంపాద‌న‌మే. కాంగ్రెస్ వాళ్లు తిన్నార‌ని టీడీపీని గెలిపించి, టీడీపీ వాళ్లు తిన్నార‌ని వైసీపీ వాళ్ల‌ను గెలిపించి… వాళ్లు తిన్నారని ఇంకొక‌ర‌ని గెలిపించ‌డం జ‌రుగుతుంది. కానీ ఎమ్మెల్యే ఎవ‌రు అయినా వాళ్లు తిన‌డం మాన‌రు. కేవ‌లం ముఖ్య‌మంత్రి విజ‌న్ వ‌ల్ల ఒరిగే లాభ‌మే తప్పించి ఈ లోక‌ల్ ఎమ్మెల్యేలు రాష్ట్రం కోసం, ప్ర‌జ‌ల కోసం క‌ష్ట‌ప‌డ‌టం అనేది చాలా చాలా అరుదు.

అందుకే ఈ సంప్ర‌దాయానికి కాస్త చెక్ పెట్టే ఉద్దేశంతో ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యేల‌లో సగం మందిని మారిస్తే క‌నీసం వ‌చ్చే టెర్ములో వారికి అయినా కొంచెం భ‌యం ఉంటుంద‌ని చంద్ర‌బాబు ఆలోచిస్తున్నార‌ట‌. అందుకే స్వార్థం త‌ప్ప ప్ర‌జ‌ల‌ను అస్స‌లు ప‌ట్టించుకోని ఎమ్మెల్యేల జాబితా త‌యారుచేస్తే అదే పెద్ద జాబితా అయ్యింద‌ట‌. అందుకే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ క‌ఠిన నిర్ణ‌యం తీసుకోవాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ని తెలుస్తోంది. రాష్ట్రంలో అతిపెద్ద షాకు రాయ‌ల‌సీమ ఎమ్మెల్యేల‌కే త‌గులుతోంది. 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు ఈసారి ఆ పార్టీ టిక్కెట్ తిర‌స్క‌రించ‌నుంది. వాళ్లెవ‌రో చూద్దాం. అయితే, ఇది టీడీపీ అధికారికంగా ప్ర‌క‌టించిన జాబితా కాదు. కాక‌పోతే పొలిటికల్ స‌ర్కిల్లో టిక్కట్ ద‌క్క‌ని పేర్లంటూ ఇవి గ‌ట్టిగా వినిపిస్తున్నాయి.

అనంత‌పురం- 
పుట్ట‌ప‌ర్తి, క‌దిరి, గుంత‌క‌ల్‌, క‌ల్యాణ‌దుర్గం, శింగ‌న‌మ‌ల,

చిత్తూరు – 
చిత్తూరు, తంబళ్ల‌ప‌ల్లె, స‌త్యేవేడు, తిరుప‌తి, ప‌ల‌మ‌నేరు

క‌ర్నూలు
ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల‌, క‌ర్నూలు, ప‌త్తికొండ‌, డోన్‌

క‌డ‌ప‌
జ‌మ్మ‌ల‌మ‌డుగు