పేకాట లో డబ్బుల బదులు కరోనా గెలిచారు !

August 05, 2020

కరోనా మమ్మీ సినిమాలోని పురుగులలాగే ఊహించని చోట పుసుక్కున కొత్త కేసులు పుడుతున్నాయి. ఎక్కడ ఎపుడు బయటపడతాయో తెలియక జనం వణికిపోతున్నారు. ఇది చంపడం పక్కన పెడితే... మాకూ వస్తుందనే భయంతో జనం చస్తూ బతుకుతున్నారు. విజయవాడలో ఇలాగే జరిగింది. 17 మందికి కేవలం కేంద్రం చెప్పిన మాట వినకపోవడం వల్లే జరిగింది. ఎవరూ ఇంట్లోంచి బయటకు వెళ్లొద్దు అని చెబుతూనే ఉంది కేంద్రం. కానీ విజయవాడలోని గుర్రాలరాఘవయ్య వీధిలో ఇరుగు పొరుగు ఇళ్ల వారు కలిసి పేకాట ఆడారు. వారికి కరోనా ముక్క పడింది. ఒక్కరికి కాదు... 17 మందికి ఆ ముక్క పడింది.

ముందు ఒక వ్యక్తికి లక్షణాలు బయటపడ్డాయి. అతని గురించి ఆరాతీస్తే కొన్ని రోజుల క్రితం కోల్ కతాకు వెళ్లొచ్చినట్లు తేలింది. అంటే... అతను కోల్ కతాకు వెళ్లొచ్చిన విషయం పట్టించుకోకుండా అతనితో అందరూ పేకాట ఆడారు. దీంతో అతనికి బెంగాల్లో సోకిన కరోనా.... విజయవాడలో బయటపడింది. అతనికి కరోనా వచ్చిందని తెలిసిన వెంటనే అతనితో పేకాట ఆడిన వారంతా టెస్టులు చేయించుకున్నారు. వారికి కూడా చాలామందికి సోకింది. మొత్తం 17 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. కృష్ణలంకలో మొత్తం 22 కేసులుటే అందులో 17 కేసులు రాఘవయ్య కాలనీలోని పేకాట ఆడిన వారివే. కేంద్రం చెప్పినట్టు లక్ష్మణ రేఖ దాటకుడా ఇంట్లో వారితోనే గడిపి ఉంటే ఆ 17 మందికి కరోనా సోేకేది కాదు. కానీ వారవేమీ పట్టించుకోకుండా లారీ డ్రైవర్ గురించి ఆరా తీయకుండా పేకాట ఆడారా. కొంప మునిగింది. దీంతో పేకాటలో డబ్బులు గెలవాల్సింది పోయి కరోనా గెలుచుకుని వచ్చినట్టయ్యింది. ఇప్పటికైనా అర్థం చేసుకుని ఇంట్లోనే ఉండండి.