నాలుగో దశలో ఇండియా : వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

August 05, 2020

అమెరికా, యూరప్ లలో నాలుగో దశకు చేరిన కరోనా ఎంత విలయతాండవం సృష్టించిందో చూశాం కదా. అయితే... ఈరోజు వైసీపీ ఎంపీ అవలీలగా చాలా తేలికగా ఇండియాలో కరోనా నాలుగో దశలో ఉందని తేల్చేశారు. ఆయన ఎవరో కాదు కర్నూలుకు చెందిన ఎంపీ సంజీవ్ కుమార్. ఈరోజు ఏపీలో కేసులు ఎక్కువొస్తుంటే అయ్యో ఇన్నా అని భయపడిపోతున్నారు. టెస్టులు చేస్తున్నారు కాబట్టి ఇపుడు బయటకు వస్తున్నాయి. ఇంకా ఘోరంగా ఉంటాయి. అయినా భయపెట్టడం ఏముంది ఇందులో.. మా ఇంట్లో 6 గురికి కరోనా సోకిందని చాాలా మామూలుగా చెప్పారాయన. 

జగనే దారుణం అనుకుంటే... ఈయన స్వయంగా ఒక డాక్టరు (యూరాలజిస్టు ) అయ్యుండి అసలు కరోనా పెద్ద విషయమే కాదన్నట్టు తేల్చేశారు. ఆయన పేల్చిన మరో పెద్ద బాంబు ఏంటో తెలుసా? ఇండియాలో కోవిడ్ 19 పాజిటివ్ కేసులు రెండు కోట్లు దాటి ఉంటాయట... మనం టెస్టులు చేయక తెలియడం లేదు అంతే అంటున్నారు. 130 కోట్ల మందికి టెస్టులు చేస్తే ఈ 2 -3 కోట్ల కేసులు బయటకు వస్తాయని... కానీ అన్ని టెస్టులు చేసే పరిస్థితి మన వద్ద లేదన్నారు. 

ఎంపీ చెప్పేది చూస్తుంటే... అసలు ఆయనలో ఇది పాండెమిక్ అనే భావనే కనిపించడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా రోగులను ట్రీట్ చేసిన వైద్యులే ఆ పరిస్థితిని చాలా ఆవేదనగా వివరిస్తుంటే... ఈయన మాత్రం చాలా లైట్ తీసుకున్నారు. 30-40 రోజుల నుంచి ఇది డెవెలప్ అవుతోంది... టెస్టుల చేస్తున్న కొద్దీ మనకు తెలుస్తోంది. మనలో ఇప్పటికే చాలా ఇమ్యూనిటీ ఉండటం వల్ల లక్షణాలు కూడా బయటపడటం లేదు. కేవలం 20 మందికి మాత్రమే లక్షణాలు బయటపడుతున్నాయని అన్నారు. బహుశా ఈయన గైడెన్స్ వల్లే జగన్ లెక్క చేయడం లేదా ఈ పాండెమిక్ ని? అయినా అయ్యుండొచ్చు.