విజయానికి ఎన్ని మెట్లు ?

November 13, 2019

ఈ రెండు ఫొటోలు చూసినపుడు మొదటి ఫొటో లో వున్న ఆమె దురదృష్టవంతురాలు అని , రెండుఫోటో లో వున్న ఆమె అదృష్టవంతురాలు అని , లేదా మొదటి ఆమె చదువుకోవాడానికి అవకాశాల్లేక అలాగే - ఒక కూలీ లాగా - వుండిపోయిందని , రెండో ఆమెను ఆమె తల్లితండ్రులు బాగా ప్రోత్సహించారని , మంచి బడి లో చేర్పించారని , లేదా మొదటి ఆమె పేదరికానికి బలి అయితే , రెండో ఆమె సంపాదన బాగా వున్న కుటుంబం లో పుట్టిందని , అందుకే బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొందని , దేనికైనా రాసిపెట్టివుండాలని , మన తల మీద శని నాన్ స్టాప్ నాట్యం చేస్తున్నాడని ... ఇలా రకరకాలుగా అనుకోవచ్చు.

వాస్తవానికి ఈ రెండు ఫొటోల్లో వున్నది ఒకే ఆమె. మొదట్లో , ఉదయం నుండి మధ్యాహ్నం దాకా రాళ్ళు కొట్టి , రోళ్ళు తయారు చేసి , మధ్యాహ్నం దాటాక , పసి బిడ్డను చంకనేసుకొని , రోళ్ళను అమ్ముకొని , ఆ అర కొర పైసలతొనే బతుకు బండి ని లాగే ఈమె , ఆ పని చేస్తూనే రాత్రిళ్ళు చదువుకొని , పరీక్షలకు కట్టి , పాస్ అయ్యి , ఇంకా ముందుకు చదివి , ఇపుడు ఏకంగా police sub inspector అయ్యింది అంటే అది ఎంత గొప్పవిషయం కదా ! జీవితం లో విజయం సాధించడం ఎలా ? అన్న ప్రశ్న కు '' విజయానికి ఆరు మెట్లు లేదా ఏడు మెట్లు '' లాంటి పుస్తకాల్లో సమాధానం వుండదు. ఇలాంటి పుస్తకాలు వ్రాసిన రచయిత / లు , మరో రంగం లో కి అడుగుపెట్టి ఘోరంగా విఫలమయ్యారు. ఆయన / వాళ్ళు వ్రాసిన పుస్తకాలు ఆయనకే / వాళ్ళకే పనికిరాలేదు. అలాంటి వాళ్ళు కొందరు '' వ్యక్తిత్వ వికాస నిపుణులు '' అనే పేరుతో పట్టణాల్లో ఇంజినీరింగ్ కళాశాలలకు , కార్పొరేట్ బళ్ళకు వస్తుంటారు. ఆయా కళాశాలలు , పాఠశాలల యాజమాన్యాలు వీళ్ళకు డబ్బు కూడా ఎక్కువగానే చెల్లించుకోవాలని విన్నాను.

విజయానికి ఆరు , ఏడు , పది , పన్నెండు .. ఇలా ఎన్ని బడితే అన్ని మెట్లు వుండవు.

విజయానికి రెండే మెట్లు: ఒకటి : నీ పట్ల నీ కున్న ఆత్మవిశ్వాసం , రెండు : పరమాత్మ పట్ల నీకున్న విశ్వాసం. ఇవి రెండూ వుంటే మిగతావి నిన్ను వెతుక్కొంటూ వస్తాయి.

 

Read Also

కేసీఆర్ ఎందుకు ఇంత మొండిగా ఉన్నారు?
​ఇక వారు జన్మలో జగన్ కి ఓటేయరు 
ఓరి నాయనో... జగన్ భాషా జ్జానం పిచ్చెక్కిస్తోంది

RELATED ARTICLES

  • No related artciles found