మోడీ ప్యాకేజీకి... 15 వేలకు లింకు పెట్టారు

August 11, 2020

తాజాగా మోడీ  అంతకంతకూ పొడిగింపులకు గురి అవుతున్న లాక్ డౌన్ వేళ.. దేశ ప్రజలకు అవసరమైనంత ఉత్కంఠను కలిగించటంలో ప్రధాని మోడీ సక్సెస్ అయ్యారు. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితం కావటం తెలిసిందే.

దీంతో.. చక్కదిద్దే కార్యక్రమానికి తెర తీసిన ప్రధాని మోడీ.. రూ.20లక్షల కోట్లతో భారీ ప్యాకేజీని ప్రకటించారు. ఆ వివరాలు దశల వారీగా తెలుపుతామని ఊరించటంతో.. ఏ రంగాలకు ఎలాంటి ఉపశమనాలు ఇచ్చారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మోడీ చెప్పినట్లుగా రూ.20లక్షల కోట్లను దేశ ప్రజలకు సమంగా పంచేస్తే? అన్న ఆలోచనను పలువురు చేస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి దేశ ప్రజల ఖాతాల్లో వేస్తానని చెప్పటం తెలిసిందే. మోడీ మొదటి టర్మ్ విజయవంతంగా పూర్తి కావటమే కాదు.. రెండో టర్మ్ లో ఏడాది పూర్తి కావొస్తున్నా.. ఇప్పటివరకూ ఆ ఊసే ఎత్తకపోవటాన్ని పలువురు విమర్శిస్తుంటారు.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రూ.20లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన మోడీ సర్కారు.. అందులో భాగంగా ఆ మొత్తాన్ని దేశ ప్రజలకు సమంగా పంచేస్తే.. ఒక్కొక్కరికి ఎంత మొత్తం వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

రాజు.. పేద, చిన్నా.. పెద్ద అన్న లేకుండా ప్రతి ఒక్కరిని ఈ పథకంలో భాగస్వామ్యం చేస్తే ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున నగదును ఖాతాల్లో జమ చేయొచ్చని చెబుతున్నారు. 20 లక్షల కోట్లని 130 కోట్లతో భాగిస్తే 15 వేల చిల్లర వస్తుందట. భలే కోఇన్సిడెన్స్ కదా ఇది.