జగన్ టీంలో అసంతృప్తి - పార్ట్ 2

February 22, 2020

ఇటీవలే పార్టీలో దీర్ఘకాలంగా కష్టపడిన తనకు పదవి దక్కలేదంటూ నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పార్టీ ఎంతోకాలం అధికారంలో ఉండదు అని అనుకుంటున్న నాయకులు వీలైనంత త్వరగా తమ కోరికలు తీర్చుకుందామంటే కుదరని పరిస్థిితి. అపుడు ఆయన ఆవేదనను అసంతృప్తి అంటే కాదన్నారు. కానీ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా జగన్ టీంలో అసంతృప్తి బయటపడింది.

జనసేన ఎమ్మెల్యే రాపాక జగన్ కి అతి బానిసత్వం చేస్తూ... అధ్యక్షా 151  మంది వైసీపీ ఎమ్మెల్యేలే కాదు.. నేను, ఇటీవలే పార్టీ మారిన మరో ఇద్దరు కలిపి 154 మంది జగన్ తెచ్చిన మండలి రద్దు బిల్లును సమర్థిస్తున్నాం అన్నారు. ఆ మాటలు విని హాయిగా ఫీలయిన జగన్ కు బిల్లు పాసయ్యే సమయానికి తగిలిన షాక్ కు నోట మాట రాలేదు.  ఏపీ ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేయాలని సోమవారం ఉదయం కేబినెట్ భేటీ నిర్వహించింది. అందులో సీఎం వైఎస్ జగన్... మండలి రద్దుపై తీర్మానం ప్రతిపాదించి వెంటనే ఆమోదం తెలిపేశారు. ఆ వెంటనే అసెంబ్లీకి వచ్చి మండలి రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అపుడా ఇపుడు అన్నట్టు... తనకు నచ్చని సభ, తన మనసు బాధపెట్టిన సభ ఉండే ప్రశ్నే లేదన్నట్లు స్వయంగా తానే మండలి రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ఆ తర్వాత జగన్ కి అసలు ట్విస్టు బోధపడింది.

బిల్లుపై సుదీర్ఘ చర్చ తర్వాత స్పీకర్ ఓటింగ్ పెట్టారు. ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసా? 133 ఓట్లు.  అదేంటీ... వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 151 కదా అనుకుంటున్నారేమో. వైసీపీలో 20 మంది జగన్ చేసిని బిల్లును బహిష్కరించారు. ఎందుకంటే... రాపాక మరో ఇద్దరు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు బిల్లును సమర్థించారు. అంటే 133లో 3 ఇతరుల ఓట్లు. 151లో 130 పోతే 21 ఉంటాయి. అందులో ఒకటి స్పీకరు ఓటు. కాబట్టి మిగతా 20 మంది జగన్ ఆలోచనను వ్యతిరేకించారు. ఇది జగన్ ను తీవ్ర అసహనానికి గురి చేసింది. వీరందరినీ జగన్ ఏం చేస్తాడా అన్నది చూడాలి.