పోర్స్ సైట్ మాటలు విని 22 మంది మహిళలు అలా మోసపోయారట

August 09, 2020

కొన్ని ఉదంతాల గురించి తెలిస్తే.. ఇలాంటివి కూడా జరుగుతాయా? అన్న అనుమానం రాక మానదు. తాజాగా చెప్పే ఉదంతం కూడా అలాంటిదే. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఒక పోర్న్ వెబ్ సైట్ (అశ్లీల వీడియోలు తయారు చేసి.. అప్ లోడ్ చేసే సైట్) 22 మంది మహిళల్ని దారుణంగా మోసం చేసింది. రొమాంటిక్ ఆలోచనల కోసం పోర్న్ వీడియోల్ని తీసి అప్ లోడ్ చేసే ఈ సైట్.. ప్రపంచంలోనే అతి పెద్ద అడల్ట్ కంటెంట్ అందించే వెబ్ సైట్లలో ఒకటిగా పేరుంది.
కొందరు ప్రైవేటు వ్యక్తుల కోసం తాము పోర్న్ వీడియోలు తీస్తున్నామని.. పబ్లిక్ గా వాటిని అందుబాటులో ఉంచమని చెప్పి.. అలాంటి వీడియోల్లో నటించే ఇంట్రస్ట్ ఉందా? అంటూ ప్రకటన ఇచ్చింది. ఈ ప్రకటనకు ఆకర్షితులైన వారు కొందరు సదరు సైట్ ను సంప్రదించారు. వారిలో 22 మంది చేత పోర్న్ వీడియోల షూటింగ్ పూర్తి చేసింది. సదరు వీడియోల్ని సీక్రెట్ గా ఉంచుతామని.. పబ్లిక్ డొమైన్ లోకి తీసుకురామని పేర్కొంది.
సైట్ తో కాంట్రాక్టు చేసి.. ఆ వీడియోలలో నటించిన వారిలో 19-22 వయసున్న అమ్మాయిలే అధికం. కాలేజీకి వెళ్లే ఈ అమ్మాయిలు.. సరదా కోసం ఇలా నటించారట. షూటింగ్ అయిపోయిన కొన్నాళ్లకు ఆ పోర్న్ వీడియోలు ఆన్ లైన్ లో ప్రత్యక్షం కావటమే కాదు.. డీవీడీల రూపంలో ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ లో అమ్ముతున్న విషయం వారికి తెలిసి షాక్ తిన్నారు. వెంటనే వారుకోర్టును ఆశ్రయించారు.
ఈ ఉదంతాన్ని విచారించిన కోర్టు.. సదరు వెబ్ సైట్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన ఈ వీడియోలకు ఏకంగా మూడు బిలియన్ (300 కోట్లు) వ్యూస్ వచ్చాయని.. దీంతో తమ ప్రతిష్ఠకు భంగం వాటిల్లటమే కాదు.. పలువురి ఉద్యోగాలు కూడా పోయినట్లుగా వారు కోర్టుకు తెలిపారు. కొందరైతే ఆత్మహత్యకు పాల్పడ్డారు కూడా. సదరు వెబ్ సైట్ ప్రకటనలో చెప్పిన దానికి.. చేసిన దానికి ఏ మాత్రం సంబంధం లేదన్న విషయాన్ని గుర్తించిన కోర్టు.. సదరు వెబ్ సైట్ తీరును తీవ్రంగా తప్పు పట్టింది. బాధిత 22 మంది మహిళలకు 13 మిలియన్ డాలర్లు (మన రూపాయిలో చెప్పాలంటే సుమారు రూ.91 కోట్లు) పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.