జగన్ బియ్యం పథకం - బియ్యం రూ.1500, సంచి రూ.500

May 25, 2020

చంద్రబాబు, లోకేష్ అధికారం కోల్పోతే ఫన్ మిస్సవుతామని వైసీపీ అభిమానులు సెటైర్లు వేసేవారు. కానీ వారు సృష్టించే ఫన్ ముందు వెయ్యి మంది లోకేష్ లు వచ్చినా చాలరు. వైసీపీ చేసే అవినీతి ముందు లక్ష మంది వైఎస్ లు కూడా సరితూగరు. బడ్జెట్ లో బుగ్గన సృష్టించిన అద్భుతాలు, విన్యాసాలు ఒక్కొక్కటీ విశ్లేషిస్తుంటే అబ్బా... అనాల్సిందే. అవినీతిలో ఈ మాస్టర్ డిగ్రీ లేకనే చంద్రబాబు తిన్న గుడ్డుకు, తాగిన నీళ్లకు కూడా వైసీపీ వాళ్లతో విమర్శలు పాలవుతున్నాుడు. ఒకసారి బుగ్గన గారి కితకితలు చూద్దామా?

బడ్జెట్ కేటాయింపులు -
బియ్యం కొనడానికి 3000 కోట్లు.
బియ్యం సంచులకి 950 కోట్లు.

దీన్ని బట్టి మీకు ఏం అర్థమయ్యింది? 2000 రూపాయల బియ్యం గవర్నమెంటు సరఫరా చేస్తే అందులో బియ్యం ఖరీదు 1500 రూపాయలు. ఆ బియ్యం ప్యాక్ చేసిన సంచి ఖరీదు 500 రూపాయలు అన్నమాట. ఇది మన మంచి ముఖ్యమంత్రి అందించిన అవినీతి రహిత పాలనలోని పారదర్శకత. ఆ బ్యాగులు, సంచిలు తయారుచేసే కంపెనీ జగన్ సతీమణి భారతి గారి బంధువులది ఎవరో అంటే విన్నాం గాని మాకయితే తెలియదు. కాకపోతే ఈ కేటాయింపులు చూస్తే బంధువుల దానికి అయితే అంతెందు కేటాయిస్తారు భారతి గారిదేనేమో అని పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. అనుమానమేనండోయ్. నిజానిజాలు ఆరాతీసుకోవాలి మరి మీరు.