జగన్ బీ రెడీ... లోకేష్ వైరల్ కామెంట్ !!

August 12, 2020

అమరావతి రగులుతోంది. రాజధాని రైతులు రోడ్లమీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజు మా బతుకులు పాడు చేయడానికి ముహుర్తం పెట్టారని అమరావతి రైతులు తీవ్ర వేదనతో ఏడుస్తూ ఆందోళన చేస్తున్నారు. భారీ పోలీసు బలగాలతో వారిని ఏపీ సర్కారు అణచివేస్తోంది.

 ఇదిలా ఉండగా... గవర్నర్ ఈరోజు మూడు రాజధానుల బిల్లు ఆమోదించడం, దానికి సర్కారు గెజిట్ విడుదల చేసి చట్టంగా గుర్తించడం రెండూ జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత లోకేష్ తీవ్రంగా స్పందించారు. 

’’వ్యవస్థల్ని నాశనం చెయ్యడం జగన్ గారి ట్రేడ్ మార్క్. ఆ ట్రాప్ లో గవర్నర్ గారు చిక్కుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. మూడు ముక్కలాటకి గవర్నర్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో బ్లాక్ డే. జగన్ రెడ్డి ఎస్ఈసి నిమ్మగడ్డ విషయంలో ఇలానే తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని మొట్టికాయలు తిన్నారు. ఇప్పుడు మూడు ముక్కలాటలో మరోసారి వైకాపా ప్రభుత్వానికి భంగపాటు తప్పదు. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ టిడిపి నినాదం. న్యాయస్థానాల్లో ప్రజల ఆకాంక్షలకు న్యాయం జరుగుతుంది. ప్రజారాజధాని అమరావతిని పరిరక్షించుకుని తీరుతాం‘‘  

లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు అమరావతి రైతులకు భరోసానిస్తున్నాయి. నిమ్మగడ్డ విషయంలో గుణపాఠం అయినట్లే ఈ విషయంలో కూడా వైసీపీకి గుణపాఠం అవుతుందని లోకేష్ అభిప్రాయపడుతున్నారు.