రాయలసీమ కుంపటి రగిల్చిన జగన్

February 25, 2020

రాష్ట్రంలో రాజ‌ధానుల‌పై చ‌ర్చ జోరందుకుంది. రాజ‌ధానికి-అభివృద్దికి ముడిపెడుతూ.. నాయ‌కులు వ్య‌వ హరిస్తున్న తీరుపై ప్ర‌జ‌ల్లో భారీ ఎత్తున భావోద్వేగం ర‌గులుతోంది. రాష్ట్రంలో రెండు వెనుకబ‌డిన ప్రాంతా లు ఉన్నాయ‌ని, వాటినిఅభివృద్ధి చేయాల్సిన బాధ్య‌త త‌మ‌పై ఉంటుంద‌ని ఆది నుంచి చెబుతూ వ‌చ్చి న వైసీ పీ నాయ‌కులు ఇప్పుడు రాజ‌ధానితోనే ఏ ప్రాంత‌మైనా అభివృద్ధి చెందుతుంద‌నే కాన్సెప్ట్‌ను భు జానికి ఎత్తు కున్నారు. ఈ క్ర‌మంలోనే సీఎం జ‌గ‌న్ అసెంబ్లీలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో మూ డు రాజ‌ధాను లు ఉంటే త‌ప్పేంటి? అనే ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న క‌ర్నూలు, విశాఖ‌, అమ‌రావ‌తిలో రాజ‌ధానులకు సై! అన్న‌ట్టుగా సిగ్న‌ల్ ఇచ్చారు.
వాస్త‌వానికి సీమ‌, ఉత్త‌రాంధ్ర జిల్లాలు వెనుక‌బ‌డిన మాట వాస్త‌వ‌మే. అయితే, వీటిని అభివృద్ధి చేసేందుకు  ఉన్న మార్గాల‌ను ప‌క్క‌న పెట్టి రాజ‌ధానుల‌తోనే అభివృద్ధి చెందుతాయ‌నే కొత్త కాన్సెప్ట్‌ను తెర‌మీదికి తీ సుకురావ‌డంపై కొంద‌రు ఆక్షేప‌ణ వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రికొంద‌రు.. క‌ర్నూలులో హైకోర్టు, విశాఖ‌లో పాల నా రాజ‌ధాని, అమ‌రావ‌తిలో చ‌ట్ట స‌భ‌ల రాజ‌ధాని ఏర్పాటు వ‌ల్ల మ‌ళ్లీ ప్రాంతాల మ‌ధ్య అస‌మ‌తౌల్యం ఏ ర్ప‌డుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ముఖ్యంగా  సీమ జిల్లాల‌ ప్ర‌జ‌ల నుంచితీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌స్తోంది. కేవ‌లం హైకోర్టు ఏర్పాటు వ‌ల్ల జ‌రిగే అభివృద్ధి ఏంట‌నేది వీరి ప్ర‌శ్న‌. ఎక్క‌డైనా అభివృద్ధి అనేది మౌలిక స‌దుపాయాల ఏర్పాటుతోనే ఉంటుంద‌ని అంటున్నారు.
అదేస‌మ‌యంలో సచివాలయం ఉన్నచోటే... అభివృద్ధి ఉంటుంద‌నే వాద‌న బ‌లంగా సీమ ప్రాంతం నుంచి వినిపిస్తోంది. అసెంబ్లీ, హైకోర్టు వల్ల అభివృద్ధి ఉండదని వారు కుండ బ‌ద్ద‌లు కొడుతున్నారు. ఎవ రికైనా పనులుండేది సచివాలయంలోనేన‌ని,  అసెంబ్లీలో సామాన్యుడికి ఏం పని ఉంటుంద‌ని, అదే సమ యంలో హైకోర్టుకు వ‌చ్చే క‌క్షిదారుల వ‌ల్ల అభివృద్ధి ఎలా సాధ్య‌మ‌నేది వారి ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇలాంటి అర్ధం లేని ఏర్పాటుతో రాయలసీమకు తీవ్ర నష్టం జ‌రుగుతుంద‌ని కూడా వారు పేర్కొంటున్నారు. ఈ నేప‌థ్యాన్ని ప‌రిశీలిస్తున్న విశ్లేష‌కులు.. ఖ‌చ్చితంగా  సీమ ప్రాంతం మ‌రోసారి ర‌గులుతుంద‌ని అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ దీనికి ఎలాంటి స‌మాధానం చెబుతారో చూడాలి.