తెలంగాణలో మరో 3 కేసులు.. లక్ ఏంటంటే..

April 06, 2020

తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మూడు కేసులు హైదరాబాదువే. లాక్ డౌన్ పరిస్థితులు మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. అయితే వారం గడిస్తే గాని వాస్తవాలు బయటపడవు. తాజాగా వెలుగుచూసిన మూడు కేసులు మొదటి దశవే కావడం కొంత ఊరట. లండన్ నుంచి వచ్చిన ఒకరికి (కూకట్ పల్లి), జర్మనీ నుంచి వచ్చిన మహిళకు(చందానగర్), సౌదీ అరేబియా నుంచి వచ్చిన మహిళకు (బేగంపేట) ఈ వ్యాధి నిర్దారణ అయ్యింది. వీరంతా క్వారంటైన్ లో ఉన్న వారే. కాబట్టి వీరి కుటుంబ సభ్యులను టెస్ట్ చేయాల్సి ఉంది. సరైన సమయంలో లాక్ డౌన్ చేయడం వల్ల మంచే జరుగుతోంది. మూడు కేసులు ఎన్నారై రిటర్న్ కావడం వల్ల ప్రభుత్వం, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇది అదృష్టంగానే భావించాలి. మొదటి దశ, రెండోదశను ప్రభుత్వం సులువుగా డీల్ చేయగలదు. కానీ మూడో దశలోకి ఎంటరైతే ఇంకా దేవుడి మీదే భారం.

ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 36 కేసులు నమోదయ్యాయి...అందరికీ చికిత్స అందిస్తున్నారు. ఎవరి పరిస్థితి క్రిటికల్ గా లేదు. ప్రజలు ఇలాగే ఇంట్లో ఉంటూ... జాగ్రత్త పడితే... నెల రోజుల్లోపు తరిమేయవచ్చు. ఇది ప్రజల చేతుల్లో మాత్రమే ఉంది. ప్రజలు సహకరిస్తే వైరస్ ను తరిమేయడం పెద్ద విషయం కాదు.  

Read Also

వాహనం ఆపినందుకు కలెక్టరుతో గొడవపడ్డాడు
తిరుగులేని నిర్ణయం తీసుకున్న కేసీఆర్ !
భార్య, పాపతో హరీష్ రావు సెల్ఫీ వీడియో...