వెనక్కు తగ్గిన జగన్... వైసీపీ నేతల అరెస్టు  

May 24, 2020

జగన్ అరాచకపాలనకు నేటి సంఘటన పీక్స్. సినిమాల్లో చూపినా భయంకరంగా కనిపించే దృశ్యాన్ని పట్టపగలు రోడ్లమీద ఆవిష్కరించారు వైసీపీ నేతలు. తెలుగుదేశం నేతలు అయిన బోండా ఉమ, బుద్దా వెంకన్నలను వెంటాడి వెంటాడు హత్య చేయడానికి ప్రయత్నించిన వైసీపీ నేతల అరాచకం చూసి రాష్ట్రం నివ్వెరపోయింది. దీంతో జగన్ అరాచకవాదం గురించి ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిందే నిజమైందనది ఏపీ ప్రజలు రూఢి చేసుకున్నారు ఈరోజు. చివరకు ప్రజల్లో బదనాం అయిపోయాం అని భావించిన వైసీపీ దాడి చేసిన వారిని తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్టు చేసింది.  బోండా ఉమ, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తున్న వాహనంపై గునపాలతో, కర్రలతో దాడికి పాల్పడ్డ తురకా కిశోర్, మల్లెల గోపి, బత్తుల నాగరాజును పోలీసులు  అరెస్టు చేసినట్టు ఐజీ ప్రభాకర్ రావు ప్రకటించారు. నిందితులు ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ ఘటనలో వెల్దుర్తికి చెందిన మరికొంతమంది నిందితులను గుర్తించామని ఆయన అన్నారు. దాడిలో పోలీసు వాహనం కూడా ధ్వంసమైనట్టు ఐజీ తెలిపారు కానీ ఆ వాహనం ఫొటోను కూడా ఎవరికీ చూపలేదు. బహుశా ఈ దాడి తీవ్రత తగ్గించడానికి పోలీసు వాహనం గురించి ప్రస్తావించి ఉంటారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా... మధ్యాహ్నం నుంచి ఈ దాడి గురించి వైసీపీ ఒక అబద్ధం ప్రచారం చేసింది. ఒక బాలుడిని గుద్ది తప్పించుకుపోతుంటే స్థానికులు దాడి చేశారని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనికి తెలంగాణలో జరిగిన ఒక ఫొటోను వాడేశారు. దానిని తెలుగుదేశం వాళ్లు తిప్పికొట్టి అది పాత ఫొటో అని నిరూపించారు. దీంతో వెనక్కు తగ్గారు. తర్వాత రాత్రికి వైసీపీ మాట మారిపోయింది. హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ ప్రజలతో వాగ్వాదం వల్ల అలా జరిగిందని, దీనికి వారు కారులో వేగంగా వెళ్లడమే కారణమని విచిత్రమైన కారణం చెప్పారావిడ. వీడియోలో బతుకుజీవుడా అంటూ తెలుగుదేశం నాయకులు తప్పించుకుంటే... డీఎస్పీ వారిని రక్షించినట్టు సుచరిత చెప్పడం గమనార్హం.