అరె రానా భలే పిక్ షేర్ చేశాడే

August 06, 2020

ప్రపంచ సినీ వేదికపై తెలుగు వాడి సత్తాచాటిన బాహుబలి 2 కి మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ట్విట్టరులో ఇది ట్రెండవుతోంది. అంతవరకు తెలుగు సినిమా అంటే ఏదో ప్రాంతీయ సినిమా అని తీసిపారేసిన బాలీవుడ్ అప్పటి నుంచి ఇంకా చెప్పాలంటే బాహుబలి పార్ట్ 1 నుంచే మన వైపు చూడటం మొదలుపెట్టింది. బాహుబలి 2 నాటికి ఆల్మోస్ట్ టాలీవుడ్ ఈజ్ ఇండియన్ సినిమా లీడర్ అని ఒప్పేసుకునే పరిస్థితి. తెలుగువారు ఇంత బడ్జెట్ ఒక సినిమాకు పెట్టడమే విచిత్రం అయితే... దానికి పది రెట్లు రాబట్టడం ఇంకా విచిత్రం. 

అలా భారతీయ చరిత్రలో మరెవరూ చేరుకోలేని ఒక రికార్డును రాసిపెట్టేశారు రాజమౌళి. మూడేళ్లయ్యింది. దానిని ఇంకా ఎవరూ టచ్ చేయలేకపోయారు. బహుశా #RRRతో మళ్లీ రాజమౌళే ఆ సినిమా రికార్డులు తిరగరాస్తారేమో చూడాలి. సరే... మూడేళ్లయిన సందర్భంగా ఆ సినిమాలో కీలక పాత్ర పోషించిన బల్లాల దేవుడు రానా ఒక సూపర్ పిక్ మనతో పంచుకున్నారు. బల్లాలుడి ఒడిలో బాహుబలి కూర్చుని దిగిన ఆ చక్కటి స్టిల్ అలా జనాల్లోకి దూసుకుపోతోంది.