33 వసంతాల "దసపల్లా" హోటల్

August 12, 2020

సాగర నగరం, నవ్యాంధ్రప్రదేశ్ కు వాణిజ్య రాజధానిగా ఎదిగిన విశాఖపట్నంలో హోటల్ "దసపల్లా"కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం ఎంట్రీ ఇచ్చిన "దసపల్లా" హోటల్ శనివారం నాటికి 33 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోక ముందు నుంచే విశాఖలో ఓ ల్యాండ్ మార్క్ గా ఎదిగిన "దసపల్లా".. నగరానికి వచ్చే దేశీయ, అంతర్జాతీయ అతిథులకు చక్కటి వసతి సౌకర్యాలను కల్పించి మంచి పేరును సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త వసతులను అందుబాటులోకి తీసుకొస్తూ.. అతిథులకు రాచ మర్యాదలను అందించింది. విశాఖ టూర్ ను పర్యాటకులకు మరిచిపోలేని మధుర స్మృతిగా మలచడంలోనూ "దసపల్లా" సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. 

విశాఖ నగరమంటేనే... సాగర అందాలను పొదివిపట్టుకున్న నగరమనే చెప్పాలి. అందమైన బీచ్ లు, అత్యంత సమీపంలోనే గుహలు, గుట్టలు, బౌద్ధారామాలు, ఆలయాలకు కేంద్రంగా మారిన విశాఖలో "దసపల్లా" తనదైన శైలి గుర్తింపును సంపాదించుకుంది. ఆధునిక యుగంలో పర్యటకులకు అవసరమైన అన్ని హంగులను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ సాగుతున్న దసపల్లాను చిరపరచితమైన తన దరహాసంతో ఆప్యాయంగా స్వాగతం పలుకుతుంటారు  వ్యవస్ఠాపక ఛైర్మన్ మండవ రాఘవేంద్రరావు గారు.అందుకే వైజాగ్ వచ్చే ప్రముఖులు ఆయన ఆప్యాయతపూరితమైన స్వాగతానికి, అపురూపమైన హాస్పిటాలిటీకి ఫిదా అవుతుంటారు. ఇప్పటికీ ఆయన తరచుగా లాబీలో కనిపిస్తుంటారు.    

ఆయన పేరు నిలబెడుతూ ఆయన అల్లుడు శరత్ జాస్తి కూడా హైదరాబాదు "దసపల్లా"ను అదే అడుగుజాడల్లో అద్భుతంగా నిర్వహిస్తుంటారు. తెలుగు నేలపై హాస్పిటాలిటీ రంగంలో రాణిస్తున్న మండవ రాఘవేంద్రరావు గారికి,  శరత్ జాస్తి గారికి "దసపల్లా" డైరెక్టర్లకు, సిబ్బందికి.... 33 వసంతాలు పూర్తి చేసుకున్న "దసపల్లా" హోటల్ కి ‘నమస్తే ఆంధ్రా’ బెస్ట్ విషెస్ తెలుపుతోంది.

 

RELATED ARTICLES

  • No related artciles found