పెద్ద నోట్లు ముంచిన కొంపలెన్నో తెలుసా?

April 02, 2020

పెద్ద నోట్లు ముంచడం ఏంటి అనుకుంటున్నారా? అదేనండీ... మన టూరిస్టు ప్రధాన మంత్రి గతంలో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల పోయిన ఉద్యోగాలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయని అందరికీ తెలిసిందే. అయితే.. తాజాగా దానికి సంబంధించిన ఒక రిపోర్టు వెలుగుచూసింది. మోదీ సర్కార్ ప్రతిష్టాత్మక డీమానిటైజేషన్ కారణంగా పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 50 లక్షల మందికి ఉద్యోగాలు ఊడిపోయాయట. ఈ మేరకు సంచలన నివేదిక ఒకటి వెల్లడయ్యింది. ఈ రిపోర్టు ఇచ్చిన సంస్థ ఆషామాషీది కాదు... బెంగుళూరుకు చెందిన అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ సెంటర్ ఫర్ సస్టెయినబిలిటీ సంస్థ. దీని లెక్కల ప్రకారం 2018లో నిరుద్యోగుల సంఖ్య 6 శాతం పెరిగిందట.
2000 నుంచి 2010 సంవత్సరాల మధ్య ఉన్న నిరుద్యోగిత శాతంతో పోలిస్తే రెండింతలు ఎక్కువని పేర్కొంది. అంటే డీమానిటైజేషన్ అనంతరం దాదాపు 50 లక్షల మందికి ఉద్యోగాలు ఊడాయని స్పస్టమైంది. కోటి ఉద్యోగాలు ఇస్తానని ఒక్కటీ ఇవ్వకపోగా ఇలా అర కోటి ఉద్యోాలుపీకించాడు మోడీ. చిన్న కంపెనీలు చితికి పోయాయి.
స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2019 పేరిట వెలువడిన ఈ రిపోర్టులో 20 - 24 వయస్సు కేటగిరీలో నిరుద్యోగం బాగా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ తీవ్రత బాగా ఉంది. నిరుద్యోగ బాధితుల్లో మహిళలు ఎక్కువున్నారు. అయితే ఎన్నికల వేళ విడుదలైన ఈ రిపోర్టు మోడీ ప్రతిష్టను ఎంతో కొంత మసకబార్చక తప్పదు. 

Down load full report here :  https://cse.azimpremjiuniversity.edu.in/state-of-working-india/swi-2019/