తిరుమలలో దొంగలు పడ్డారు

May 25, 2020

చంద్రబాబు హయాంలో ఏ నగలు పోలేదని టీటీడీ ధృవీకరించినా చంద్రబాబు రెండు డైమండ్లు కొట్టేశాడని వైసీపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ సబ్జెక్టుపై విజయసాయిరెడ్డి నెల పాటు విమర్శలు చేశారు. కట్ చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చి వంద రోజుల్లోపే తిరుమలలో రెండు అరాచకాలు జరిగాయి. 

  1. ఆర్టీసీ బస్సు టిక్కెట్లపై జెరూసలెం యాత్రలు ముద్రించి క్రైస్తవ మత ప్రచారం చేశారు. ఇది జాతీయ స్థాయిలో విమర్శలకు తావిచ్చింది. చివరకు ప్రభుత్వం ఒక వ్యక్తిని ముద్దాయి చేసి ఇష్యూని చల్లార్చింది.
  2. తాజాగా టీటీడీలో ట్రెజరీలో ఉన్న 5 కిలోల వెండి కిరీటం, 2 బంగారు ఉంగరాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట. దీనికి టీటీడీ ఏఈవో శ్రీనివాసులును బాధ్యునిగా చేస్తూ అధికారులు ఆయన జీతం నుంచి రికవరీ చేశారట. 

చిత్రం ఏంటంటే... ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే... స్వామి వారి సన్నిధిలో సంపదను దొంగలపాలు చేస్తే జీతం నుంచి రికవరీ చేసి వదిలేయడం ఏంటని విమర్శలు చేస్తున్నారు భక్తులు. రేప్పొద్దున ఎవరికిష్టం వచ్చినవి వారు తీసుకెళ్లి డబ్బులు కట్టిస్తే ఓకేనా అని ప్రశ్నించారు. ఆశ్చర్యం ఏంటంటే... స్వామి వారికి అపుడపుడు అలంకరించేవి, బహుమానంగా వచ్చిన నగరలు ట్రెజరీలో దాస్తారు. అందుకే అక్కడ సీసీ కెమెరాలు, పహారా గట్టిగా ఉంటాయి. అలాంటి చోట అధికారుల హస్తవాసి లేకుండా దొంగలు ఎత్తుకెళ్లలేరు. మరి దొంగకు సహకరించింది ఎవరు? ఆభరణాలు ఎందుకు తిరిగి రికవరీ చేయలేదు అని హిందు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ప్రభుత్వం టీటీడీని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపణలు చేస్తున్నాయి.