ముంబై తాజ్ హోటల్ లో ఏం జరిగిందో తెలుసా...

May 27, 2020

ప్రముఖులకు ఇష్టమైన విడిదుల్లో తాజ్ గ్రూప్ హోటల్స్ ఎపుడూ టాప్ ప్రయారిటీలో ఉంటాయి. అయితే తాజాగా ముంబైని షేక్ చేసిన విషయం ఏంటంటే... ఆ తాజ్ హోటల్లో ఆరు మంది సిబ్బందికి కరోనా సోకింది. దీని సోర్స్ తెలుసుకోవడానికి ముంబై నగరపాలక సంస్థ అన్ని విధాల ప్రయత్నించింది. ఇపుడు వీరికి సోకిన కారణంగా అదే హోటల్లో సిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్లో ఉంచారు.  అయితే... పేరు వెల్లడించిన ఒక పోలీసు అధికారి తెలిపిన సమాచారం మేరకు ఆ హోటల్ నుంచి కొందరు డాక్టర్లకు క్యాటరింగ్ వెళ్తోందని అది కరోనా సోకిన ప్రధాన మార్గం అయిఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 6 గురు సిబ్బంది మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇక మహారాష్ట్ర కరోనా కేసుల్లో టాప్ ప్లేసులో ఉంది. దేశంలో కేసులు, మృతులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఇదే. ముంబై పరిస్థితి ఆల్మోస్ట్ న్యూయార్క్ లాగా ఉంది. ముంబైలోని ఆసియా అతిపెద్ద మురికి వాడ అయిన ధారావి లో రోజు రోజుకు కొత్తకేసులు బయటపడుతున్నాయి. అక్కడ కంట్రోల్ చేయడం పెద్ద ప్రహసనం అయిపోతోంది. దేశంలో 8 వేల కేసులు నమోదైతే 1574 కేసులు ఈ రాష్ట్రానివే. అందులో ముంబై కేసులే 1000 ఉన్నాయి. 250 మరణాల్లో 110 ఇక్కడివే. తర్వాత తమిళనాడు, ఢిల్లీ, రాజస్తాన్, తెలంగాణ, మధ్య ప్రదేశ్, యూపీ, ఏపీ, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దేశంలోని కేసుల్లో 70 శాతం కేసులు ఈ రాష్ట్రాలవే కావడం గమనార్హం.