బిగ్ బ్రేకింగ్... తెలంగాణ కరోనా మృతులు 2 కాదు 6

June 06, 2020

కరోనాకు సంబంధించి తెలంగాణలో ఆలస్యంగా ఓ ఘోరం వెలుగుచూసింది. తెలంగాణకు చెందిన తొలి మరణం నిన్న మొన్న నమోదైందని తెలిసిందే కదా. అయితే ఆ మరణం అనంతరం అతనికి కరోనా ఉందని గుర్తించారు. అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే.. తెలంగాణలో కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య ఈరోజు ఐదు, మొత్తం ఏడు అని తెలంగాణ గవర్నమెంటు ప్రకంటించింది.

ఇప్పటివరకు దేశంలో లోకల్ ట్రాన్స్ మిషన్ లోనే ఉన్నాం. కానీ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ లో లేం. ఇదే విషయాన్ని కేంద్రం తాజాగా ధృవీకరించింది. అయితే... ఢిల్లీలో మార్చి 13-15 మధ్య జరిగిన ఓ మతపరమైన సభ దేశంలో అనేక మందిని ఈ వ్యాధి బారిన పడేసింది. అయితే... అప్పటికి ఇంకా దేశం పూర్తిగా అప్రమత్ం కాలేదు. అందుకే ఆ సభను పట్టించుకోలేదు. అయితే... ఘోరం ఏంటంటే... విదేశాల ద్వారా వచ్చిన వ్యక్తులే ఇంతకాలం ప్రమాదం అని  గవర్నమెంటు గుర్తిస్తూ వచ్చింది. కానీ... ఆ సభకు హాజరైన వారిలో వందలాది మందికి కరోనా సోకిందనే విషయం తాజాగా స్పష్టంగా. మూడు రోజలుగా గవర్నమెంటు దీనిని అనుమానిస్తోంది గాని ఈరోజు ఒక క్లారిటీ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆ సభకు జనం హాజరయ్యారు. అలా హాజరైన వ్యక్తి మొన్న లక్డీకాపూల్ లోని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అనుమానం వచ్చి అతనికి కరోనా పరీక్షలు చేయగా కరోనా వ్యాధి సోకినట్లు గుర్తించారు. అతని వివరాలు తెలుసుకున్న ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. అతను ఢిల్లీలోని జమాత్ సభకు హాజరైన వ్యక్తిగా గుర్తించారు. ఇదే విధమైన కేసులు ఏపీలో కూడా నమోదు కావడంతో వెంటనే గవర్నమెంటు యుద్ధప్రాతిపదికన ఆ సభకు వెళ్లొచ్చిన వారి వేట మొదలుపెట్టింది. దీంతో అనేక ఘోరాలు బయటపడ్డాయి.

జమాత్ సభకు వెళ్లొచ్చిన వారిలో ఒకరు మొన్న గ్లోబల్ ఆస్పత్రిలో చనిపోగా... తాజాగా గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు, అపోలోలో ఒకరు, నిజామాబాద్, గద్వాలలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఆరు మంది మరణించారు. వెంటనే ప్రభుత్వం తాజాగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆ సభకు వెళ్లొచ్చిన వారు స్వచ్ఛందంగా ప్రభుత్వాన్ని సంప్రదించాలని కోరడంతో పాటు వారిని వెతకడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసింది. వీటికి కలెక్టర్లు నేతృత్వం వహిస్తున్నారు. దీంతో కరోనా పుట్టి పగిలినట్టు అయ్యింది. ఇది దేశవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సభకు అనేక రాష్ట్రాల నుంచిప్రజలు హాజరయ్యారు. ఇది రేపు సంచలనం కానుంది.