’రామోజీ‘ వద్దకు సాహో !

May 29, 2020

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవెయిటెడ్‌ మూవీ ‘సాహో’ ఈ నెల చివరన విడుదల కానుంది. శనివారం సాయంత్రం విడుదల అయిన ఈ ట్రైలర్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ ను బట్టి ఈ భారీ యాక్షన్ ట్రీట్ ప్రపంచ వ్యాప్తంగా సినీప్రేక్షకులను అలరించేలా ఉంది. సినిమా ఎపుడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

* ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దీనికి దర్శకుడు. ఇతని వయసు 28 సంవత్సరాలు. 23 సంవత్సరాల వయసులో రన్ రాజా రన్ సినిమాకు దర్శకత్వం చేశాడు. అది హిట్. సాహో రెండో సినిమా. ఇతని స్వస్థలం అనంతపురం.
* ఇండియాలో ఒక కొత్త దర్శకుడు 100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ కలిగిన సినిమాకు దర్శకత్వం వహించడం ఇదే తొలిసారి. సాహో బడ్జెట్ 200 కోట్లు దాటింది.
* ఇండియాలో అతిపెద్ద యాక్షన్ సినిమా ఇదే. ఖర్చుతో కూడుకున్నది మాత్రమే కాదు, టెక్నికల్ గా కూడా మంచి వెయిట్ ఉన్న సినిమా. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ దీని యాక్షన్ సీన్స్ డిజైన్ చేశారు.
* ఆగస్ట్ 18న RFCలో సాహో వేడుకను భారీగా ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం సెట్లు కూడా వేస్తున్నారు ఆర్ట్ డైరెక్టర్స్.ఇండియన్ సినిమాలోని ప్రముఖులంతా దీనికి హాజరవుతున్నారు. అందుకే భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
* ఇందులో ప్రభాస్ డూప్ లేకుండా చాలా రిస్కీ స్టంట్స్ చేశారు. ఈ సినిమాలో 20 నిమిషాల నిడివి ఉన్న చేజ్ సీన్ ఉంది. ఈ సీన్ దుబాయ్ లో చిత్రీకరించారు. ఈ సినిమా కోసమే ప్రభాస్ స్కూబా డైవింగ్ నేర్చుకున్నారు.
* ఈ సినిమా ఇప్పటికే 150 కోట్ల లాభాల్లో ఉందంటున్నారు నిర్మాతలు.