కరోనా: భారీ స్కోరు చేసిన భారత్

August 08, 2020

ఇండియా రికార్డు సృష్టించింది. చాలా ముందుగా లాక్ డౌన్ ప్రకటించినా మర్కజ్ మసీదు మోడీ కలలను కల్లలుగా మిగిల్చింది. దేశ వ్యాప్తంగా ఇంతకు మునుపటి అన్ని రికార్డులు చెరిపేసుకుని 704 కొత్త కేసులు నమోదు చేసింది. ఇంకా విషాదకరమైన విషయం ఏంటంటే... మరణాలు కూడా అత్యధికంగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 28 మంది మరణించారు. దీంతో కోవిడ్ మరణాలు 111కి చేరాయి. దీంతో ఇండియాలో ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య 3851 నమోదైంది.

ఇక తెలంగాణలో ఒక్క రోజే 52 కేసులు పెరిగి 321 కేసులకి చేరాయి. 34 మంది ఇంతవరకు కోలుకోగా మొత్తం ఏడు మంది చనిపోయారు.  అంటే 280 యాక్టివ్ కేసులు చికిత్స పొందుతున్నాయి. మరోవైపు ఏపీలో కూడా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం ఏపీలో 303 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన 18 కొత్త కేసులతో కర్నూలులో మరింత భయంకరంగా పెరిగిగింది. మొత్తం 74 కేసులు కర్నూలులో నమోదవడంతో అది ఫస్ట్ ప్లేసులో ఉంది. నెల్లూరు రెండో స్థానంలో ఉంది. అక్కడ 42 కేసులున్నాయి.