​జగనన్న... నీ రికార్డు నెవర్ బిఫోర్, ఎవరాఫ్టర్ !

May 25, 2020

ఏపీలో కొత్త రోడ్లు వేయలేదు

(జగన్ ఇంటికి తప్ప)

కొత్త ప్రాజెక్టులు కట్టలేదు

కొత్త కంపెనీలు పెట్టలేదు

కొత్త రాజధానికి డబ్బులివ్వలేదు

కానీ... అప్పు మాత్రం దిమ్మతిరిగేలా పెరిగింది. 77 వేల కోట్ల రూపాయలు కేవలం పది నెలల్లో ఏపీ ప్రభుత్వం ప్రజలపై మోపింది. అప్పు అయితే అయ్యింది.... పోనీ ఆ డబ్బులు ఏదైనా పనికొచ్చేపనికి వాడారా అంటే అసలు వివరాలే చెప్పరు. రాష్ట్రంలో రెండు అత్యంత కీలకమైన పనులు రాజధాని, పోలవరం. ఈ రెండింటికీ రూపాయి ఇవ్వలేదు. మరి ఏమీ కట్టకుండా, ఏ రోడ్లు వేయకుండా ఇన్ని వేల కోట్లు అప్పులుచేసిన ఘనత చరిత్రలో జగన్ రెడ్డికే దక్కుతుంది. ఇలాంటి రికార్డు నెవర్ బిఫోర్, ఎవరాఫ్టర్. 

జగన్ పొద్దున లేస్తే చేసేవి రెండే పనులు... ఒకటి తనకు నచ్చిన రెడ్డిని పిలిచి నచ్చిన పదవి కట్టబెట్టడం. రెండోది ఓటు బ్యాంకును ఐడెంటిఫై చేసి పప్పు బెల్లాలు పంచి పెట్టడం. ఇంతే. ఈ రెండు పనులు తప్ప ఏపీలో ఇంతవరకు ఏ అభివృద్ధీ లేదు. ఏ పురోగతి లేదు. పథకాలకు పద్ధతి లేదు. ప్రాతిపదిక లేదు. అర్హతను చూడటం లేదు. పార్టీవారికి నచ్చిన వారికి ఇవ్వడం. అర్హులైనా కూడా వేరే పార్టీ వారయితే రద్దు చేయడం. కొత్తవేమీ సృష్టించకపోగా... గత ప్రభుత్వం కట్టిన ప్రజావేదికను కూల్చేయడం జగన్ సాధించిన ఘనత. 

ఇప్పటివరకు జగన్ పాలనలో 10 నెలలు గడిస్తే... 3 నెలలు ఇసుక గొడవతో కోట్లమందికి ఉపాధి బంద్, 3 నెలలు రాజధాని గొడవతో ఏపీలో అభివృద్ధి బంద్, 2 నెలలు ఎలక్షన్ గొడవతో హింస, దౌర్జన్యం, చివరి రెండు నెలలు కరోనా తో బిజీ. పోనీ ఈ పని అయినా సరిగా చేస్తున్నారా అంటే ఏ వివరాలు సరిగా బయటకు చెప్పారు. ప్రెస్ మీట్లో N95 మాస్క్ పెట్టుకున్న మంత్రి... అందరు డాక్టర్లుకు మాస్కులెందుకు అంటూ తిడతాడు. జ్వరము జలుబు వచ్చినోడికి మామూలు డాక్టరు పరీక్ష చేస్తేనే కదా వాడికి కరోనా లక్షణాలున్నాయో లేదో తెలిసేది.. అంతలోపు ఆ డాక్టరు సోకితే? ఒరే మాస్కులివ్వండిరా అని అడిగినందుకు ఉద్యోగం పీకేశారు. ఈరోజు ఏకంగా ప్రభుత్వం ఏ సదుపాయం కల్పించడం లేదు అని ఒక మున్సిపల్ కమిషనర్ ఆవేదన వ్యక్తంచేశారు. మాకూ సదుపాయాలు లేవని అనంతపురం జూనియర్ డాక్టర్లు అసహనం చెందారు. మరి 77 వేల కోట్లు అప్పు చేసి జగన్ ఎవరిని సంతోషపెట్టారు? తన రెడ్డి వర్గాన్నా? లేకపోతే ఏపీలో ఏమైనా జనం డబ్బులతో కొంపదీసి చర్చిలు కట్టుకుంటూ పోయారా?