దేశంలో ఆ నగరాల తర్వాత ఏపీ జిల్లాలే టాప్

June 04, 2020

ఏపీలో కొత్త కేసులు ​శరవేగంగా పెరుగుతున్నాయి. 80 కొత్త కేసుల నమోదుతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 1177కి పెరిగింది. ఇదిలా ఉండగా... దేశంలో మహా నగరాలు తీసేస్తే మోస్ట్ అఫెక్టెడ్ జిల్లాల జాబితాలో ఏపీకి చెందిన జిల్లాలు మూడు చేరడం విశేషం. ముంబై, కోల్ కతా, బెంగుళూరు, హైదరాబాదు, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, పుణె వంటి పెద్ద నగరాలు మినహాయిస్తే... ఏపీ లోని మూడు జిల్లాలు టాప్ లో నిలుస్తున్నాయి.

నిన్న కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ చెప్పినట్టు... కరోనా విచ్చలవిడిగా ఏపీలో ఉంటే... అతి త్వరలో ఏపీ అన్ని రాష్ట్రాలను బీట్ చేసే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో 200 కేసులు దాటిన జిల్లాలు మూడు ఉండటం ఆశ్చర్యం. కర్నూలు 292, గుంటూరు 237, కృష్ణా 210 కేసులతో దేశంలో అత్యధిక కేసులున్న జిల్లాలుగా రికార్డు నిలిపాయి. 

ఇంత జరిగిన ఏపీ నాయకుడిలో గాని, ఆయన అనుచరుల్లో గాని మార్పు రాలేదు. ఎన్నికల సమావేశాలు నిర్వహిస్తూ లాక్ డౌన్ నిబంధను తుంగలో తొక్కుతున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎక్కడ చూసినా ఏపీ నాయకులు గుంపులుగుంపులుగా తిరుగుతూ కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నారు.