రికార్డు కొనసాగించిన ఏపీ !

August 04, 2020

వరుసగా ఐదో రోజు ఏపీ పెద్ద మొత్తంలో కేసులను నమోదు చేసింది. గత 24 గంటల్లో ఏపీ కేసులు 81 పెరిగాయి. ప్రస్తుతం 1097కి చేరాయి.  విపరీతంగా టెస్టులు చేయడం వల్ పెద్ద సంఖ్యలో కేసులు వస్తున్నాయని చెబుతున్న ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున టెస్టులు చేస్తున్నది తామే అని చెప్పుకుంటోంది. ఇంతవరకు ఏపీలో 231 మంది డిశ్చార్జి అయ్యారు. 31 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 835 గా ఉన్నాయి. 

ఇదిలా ఉండగా... నిత్యం 5-6 వేల టెస్టులు చేస్తున్నట్టు ఏపీ సర్కారు చెబుతోంది. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ప్రస్తుతం కర్నూలులో 279, గుంటూరులో  214, కృష్ణాలో 177 కేసులు నమోవడంతో ఆయా జిల్లాలు వణికి పోతున్నాయి. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి భయపడే పరిస్థితి. 

కర్నూలు  పక్కనున్న తెలంగాణ జిల్లాల పోలీసులు గ్రామాలెంబడి తిరుగుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ కర్నూలు జిల్లాకు పోవద్దని ప్రచారం చేస్తున్నారు. మీకు దండం పెడతాం. అర్థం చేసుకోండి. బతికుంటే ఏదో ఒకటి చేసి బతుకుదాం కర్నూలు జిల్లాకు పోవద్దు. మన ఊరికి కరోనా తెచ్చుకోవద్దు అని పోలీసులు బతిమలాడుతున్నారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. దీన్ని బట్టి ఏపీలో అత్యధికంగా నమోదైన కర్నూలు ప్రజల పరిస్థితి ఏంటో అర్థమవుతుంది.