కరోనా భయంతో ఖైదీలు ఏం చేశారో తెలుసా?

April 06, 2020

కరోనా వల్ల నేరుగా ప్రాణ నష్టం తక్కువే గాని... సెడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. కరోనా ప్రభావం ప్రపంచంలో అన్ని రంగాలపై పడింది. తాజాగా ఏం జరిగిందో తెలిస్తే... మీరు ఆశ్చర్యపోతారు. కరోనా వస్తుందనే భయంతో ఖైదీలు చేసిన అల్లర్లలో 23 మంది ఖైదీలు చనిపోయారు. ఇది జరిగింది మన దేశలో కాదు. కొలంబియా దేశంలో జరిగిన ఈ ఘటనకు కారణం కూడా కరోనాయే. వారి బాధ ఏంటంటే... జైలు అధికారులు సరయిన చర్యలు పాటించడం లేదని, కనీస పరిశుభ్రత సదుపాయాలు లేకపోవడం వల్ల కరోనా ఒక్కరికి సోకితే అందరూ చనిపోతామని వారు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన గొడవల్లో 23 మంది చనిపోయారు. 83 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

జైల్లో గొడవలు జరగడం, అది కూడా కొలంబియా దేశ వ్యాప్తంగా జరగడం విచిత్రం. కరోనా వచ్చినా అంతమంది చనిపోయేవారో లేదా తెలియదు గాని ఆ భయంతో గొడవలు జరిగి చనిపోవడంపై అందరూ అధికారులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. అయితే... దీని వెనుక వేరే కారణాలు ఉండుంటాయని... ప్రభుత్వాన్ని బదనాం చేసి ఈ సందర్భంగా ఉపశమనం పొందాలని ఖైదీలు ప్లాన్ చేసి ఇలా చేశారన్నది అధికారుల అనుమానం. 

Read Also

ఇటలీలో తెలుగు మైనర్.... కరోనా నుంచి కాపాడమని వేడుకోలు
NRI: ప్రపంచాన్ని జయించిన ఆనందం వీరిది 
లండన్ లో చిక్కుకున్న విద్యార్థులను వెంటనే ఇండియా కి రప్పించాలి

RELATED ARTICLES

  • No related artciles found