‘ఆర్య‘కు 16 ఏళ్లు - చాలామంది ఆ విషయం గుర్తించలేదు

August 07, 2020

ఆర్య... సుకుమార్ టాలెంట్ కు ఒక మచ్చు తునక. ఒక్కసారిగా ఆ సినిమాతో సుకుమార్ బ్లాక్ బస్టర్ దర్శకుడు అయిపోయారు. మొదట్నుంచి టాలీవుడ్లో సుకుమార్ డిఫరెంట్ దర్శకుడు. ట్రెండీగా సినిమాలు తీస్తే అతనికంటే స్టైలుగా ఎవరూ సినిమా తీయలేరు. దాన్ని ఒకసారి కాదు అనేక సార్లు నిరూపించారు. అతనికి తగ్గ హీరో అల్లు అర్జున్. ఆర్య1, ఆర్య2 సినిమాలు హిట్ అవడానికి ఈ ఇద్దరి కాంబినేషనే కారణం.

ఇక ఈ సినిమా గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 16 సంవత్సరాలు అయ్యింది. అభిమానులు దీనిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ ఒక విషయం ఎవరూ గమనించడం లేదు. ఆ సినిమాలో హీరోయిన్ ది ప్రధాన పాత్ర. సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది.  ఆ పాత్ర చేసిన అనురాధ మెహతా మైసూరు అమ్మాయి. ఇదే అమ్మాయికి మొదటి సినిమా. అదృష్టవ శాత్తూ బ్లాక్ బస్టర్ అయ్యింది. తర్వాత మూడు తెలుగు సినిమాలు చేసింది. మరో మూడు వేరే సినిమాలు చేసింది. 2008 నుంచి సినిమాలో ఫేడవుట్ అయ్యింది. అంత బ్లాక్ బస్టర్ సినిమాతో కెరీర్ స్టార్ట్ అయినా నిలబెట్టుకోలేక పోయింది. ఆ సినిమా విడుదలైనప్పటి నుంచే సీక్వెల్ గురించి చర్చ జరిగింది. అలాంటి సినిమా ఇంకో హీరోయిన్ కి పడి ఉంటే ఆ వ్యవహారమే వేరుండేదమో. ఆర్య 2 సినిమా వచ్చేటప్పటికి ఆమె ఇండస్ట్రీలో లేకపోవడం విచిత్రం. వాస్తవానికి అప్పటికి ఆమె అందుబాటులో ఉన్నా సుకుమార్ ఆ పాత్రను అనురాధతో చేయించేవాడు కదా.. ఎందుకంటే అనురాధ మెహతా ఆర్య 2 ట్రాన్సఫర్మేషన్ ను అందుకోలేకపోయేది. ఇలా బ్లాక్ బస్టర్ సినిమాతో మొదలుపెట్టి తర్వాత ఒక్క మంచి సినిమా కూడా చేయని హీరోయిన్ అనురాధే.