జగన్ కు మళ్లీ అక్షింతలు తప్పవా?

July 06, 2020

ప్రజల కోసమే తాను ఉన్నది అని జగన్ నిత్యం చెబుతుంటారు. ఒక పెద్ద హోదాకు చేరినపుడు వ్యక్తిగత రాగద్వేషాలకు దూరంగా ఉన్నవాడే నాయకుడు అవుతాడు. మరి నిత్యం పగ, కక్షలతో రగలిపోయే జగన్ జనానికి ఎలా నాయకుడు అనిపించుకుంటారు. ఆయనకు ఎవరి మీద అయినా కోపతాపాలు ఉంటే అధికార బలంతో దానిని తీర్చుకోవాల్సిన అవసరం లేదు. సరైన పాలన అందిస్తే ప్రజలే మిగతా వాళ్లను పక్కన పెట్టి తనను హీరోను చేస్తారు. మరి అది ఎలాగూ జరగదు అనే ఉద్దేశంతోనే.. తాను సరైన పాలన అందించలేను. ఎంతకాలంల ఉంటానో తెలియదు కాబట్టి... నచ్చని వారిపై ఫాస్టుగా ఏదో ఒక దాంట్లో ఇరికించాలి అన్న తాపత్రయం జగన్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే అధికారులు, నేతలను వరుస పెట్టి వేధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అంతకుమించి బహుళ ప్రజానీకానికి ఉపయోగపడే మౌలిక సదుపాయాలు, తాగునీరు, సాగునీరు, రవాణా వంటి వాటి గురించి జగన్ గత 8 నెలల్లో ఏ నిర్ణయం తీసుకోలేదు. వాళ్ల మీద వీళ్లమీద పెట్టే శ్రద్ధ ఏదో పరిపాలన మీద పెడితే బాగుంటుంది కదా?

ఇటీవల మరో కక్ష సాధింపులో భాగంగా ఏబీ వెంకటేశ్వరరావు పై జగన్  సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఒక అధికారిపై ఇలా వేస్తే... ఆయన క్యాట్ కు వెళ్లారు. జగన్ ను క్యాట్ నానా తిట్లు తిట్టింది. తాజాగా ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూడా కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం తన పట్ల దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. తన సస్పెన్షన్ ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ తగిన ఆధారాలు సమర్పించారు. ఎంత కక్షతో ఉన్నారంటే...  గత ఏడాది మే నుంచి ఏపీ ప్రభుత్వం తనకు వేతనం కూడా చెల్లించడం లేదని ఆ పిటిషన్ లో ఏబీ పేర్కొన్నారు. తన పై చేసిన ఆరోపణలు నిరాధారం అని, వాటి ఆధారంగా తనను సస్పెండ్ చేశారని, దీని వల్ల తన ప్రతిష్ట దెబ్బతిన్నదని ఏబీ తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లతోనే తనను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని తన సర్వీసును పునరుద్ధరించేలా చేయాలని ఆయన కోరారు.

Read Also

కేజ్రీవాల్ కీలక నిర్ణయం
సింగపూర్ లో కండోమ్ ల కొరత... కారణమే షాకింగ్ !
సాల్లేబ్బా నీ సంబడం... ఐవైఆర్