నోబెల్ గ్రహీత... తీహార్ జైల్లో ఎందుకున్నాడో తెలుసా?

July 04, 2020

కొన్ని సినిమాలు చూస్తాం. ఉన్నట్లుంది అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు లభిస్తాయి. కానీ.. అతడి గతంలో దారుణమైన అవమానాలు.. ఊహకు అందనన్ని విషయాల్ని ఉన్నట్లుండి రివీల్ చేసి.. సినిమా చూసే ప్రేక్షకుడ్ని థ్రిల్ కు గురి చేస్తుంటారు. తాజాగా రీల్ సన్నివేశాన్ని తలపించే ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. అది కూడా నోబెల్ బహుమతి విన్నర్ కమ్ మనోడైన అభిజిత్ కు సంబంధించిన ఒక పాత విషయం సరికొత్తగా బయటకు వచ్చింది.
ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమతిని నిన్ననే ప్రవాసభారతీయుడైన అభిజిత్ ను వరించటం తెలిసిందే. దీంతో ఆయన రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోయారు. ఆయనకు సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన కాలేజీ డేస్ కుసంబంధించిన విషయాలకు సంబంధించి కొత్త విషయం బయటకు వచ్చింది. కాలేజీ డేస్ లో అభిజిత్ పై దేశద్రోహం కేసుతో పాటు.. హత్యానేరాన్ని కూడా పెట్టారు. అయితే.. ఇంత భారీ నేరాలు చేసినట్లుగా కేసులు ఎందుకు పెట్టారన్న విషయాన్ని తెలుసుకుంటే మరింత విస్మయానికి గురి కావాల్సిందే.
ఆర్థికవేత్తగా సుపరిచితుడైన ఆయన.. గతంలో కరుడుగట్టిన నేరస్తులు ఉండే తీహార్ జైల్లో ఏకంగా పది రోజుల పాటు ఉండటం గమనార్హం. మూడేళ్ల క్రితం ఆయనో ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో అభిజిత్ తనకు సంబంధించిన పలు అంశాల్ని వెల్లడించారు.
1983లో తాను జేఎన్ యూలో చదువుకుంటూ ఉండేవాడినని.. ఒక సందర్భంలో ఒక విద్యార్థి సంఘం నేతను బహిష్కరించారన్నారు. దీంతో.. తామంతా కలిసి నిరసనను తెలియజేశామన్నారు. వీసీను ఘోరవ్ చేయగా తమను కొట్టటమే కాదు.. కొందరు విద్యార్థులను అరెస్ట్ చేశారన్నారు. అలా అరెస్ట్ అయిన వారిలో తాను కూడా ఒకడినని చెప్పారు. ఈ సందర్భంగా తమను 10 రోజుల పాటు తీహార్ జైల్లో ఉంచారన్నారు. ఆ సమయంలో తమను కొట్టారన్నారు. అంతేకాదు.. తమపైన రాజద్రోహం.. హత్యాయత్నం లాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారన్నారు.
పది రోజులు తీహార్ జైల్లో ఉండటం మాత్రం చాలా కష్టంగా మారిందని చెప్పారు. దేవుడి దయ వల్ల తాము బయటకు వచ్చామన్నారు. తిహార్ జైల్లో ఉండటం మాత్రం జీవితంలో మర్చిపోలేని భయానక అనుభవంగా అభివర్ణించారు. రీల్ లో మాత్రమే చూసే ఈ తరహా ఫ్లాష్ బ్యాక్ నోబెల్ విన్నర్ అయిన మనోడికి ఉండటం చూస్తే.. మన వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయనటానికి ఇదో చక్కటి ఉదాహరణగా చెప్పక తప్పదు.