నిరాశ పరచని జగన్ !

June 01, 2020

తెలుగు ప్రజలకు కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే.. ఉత్సాహం, కానీ జగన్ ప్రెస్ మీట్ అంటే... ఎక్సైట్ మెంట్, సంబరం. తన విచిత్రమైన తెలుగుతో, అద్భుతమైన వైద్య పరిజ్జానంతో, గణిత శాస్త్ర ప్రావీణ్యంతో అందరినీ ముచ్చటపడేలా చేసే జగన్ ఈరోజు కూడా ఎవరినీ నిరాశ పరచలేదు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ కి ట్రంప్ అయినా జంకుతున్నాడు గాని జగన్ కించిత్ కూడా భయపడటం లేదు. దాంతో కలిసి సహజీవనం చేయాలని చెబుతూ ప్రజలందరికీ షాక్ ఇచ్చారు జగన్. నాకు రావచ్చు, నీకు రావచ్చు... నీ పక్కింటోడికి రావచ్చు. వచ్చినా మందులేసుకుంటే తగ్గిపోతుంది. ఇదేమంత సీరియస్ ప్రాబ్లమ్ కాదు అంటూ జగన్ మరో ఆణిముత్యం వదిలారు.

 

ఆణిముత్యాలు

1. అది నథింగ్ బట్ జ్వరం, మందులేసుకుంటే తగ్గిపోతుంది.

2. రాబోయే రోజుల్లో మనం, కరోనా ఇద్దరు కలిసి జీవించాల్సిన పరిస్థితి ఉంటుంది. 

3. క‌రోనా కూడా స్వైన్ ఫ్లూ త‌ర‌హాలోనిదే. జాగ్ర‌త్త‌లు తీసుకుంటే న‌యమవుతుంది.

4. ఇది జ్వ‌రం కంటే ఎక్కువ కాదు 

5. సర్వ సహజంగా  రాబోయే రోజుల్లో ఇది అందరికీ కూడా ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉంటుంది

6. ఇట్ బికమ్స్ ఇమ్యూనిటీ, ఇమ్యునిటీ ఈజ్ ద లాస్ట్ అస్త్రం.