ఏపీలో ఏసీబీ కలకలం

April 05, 2020

మనం తప్పు చేస్తే మనం సరిదిద్దుకోవాలి. కానీ ఏపీ ముఖ్యమంత్రి కాస్త తెలివైన వారు కదా. అలా చేయడం వల్ల తనకు వేల కోట్ల నష్టం కాబట్టి... ఇంకో రూపంలో తాను మంచివాడు అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన అవినీతి కేసుల్లో కోర్టులకు తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి... ఏపీలో అవినీతిపై ఉక్కుపాదం మోపాలని ఏసీబీని ఆదేశించారు. కొంతకాలం క్రితం ఎమ్మార్వో ఆఫీసులపై విరుచుకుపడ్డ ఏసీబీ తాజాగా మున్సిపల్ ఆఫీసులపై దాడులు చేసింది. 

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లాల్లోని పలు మున్సిపల్ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా నిత్యం అవినీతి తాండవించే టౌన్ ప్లానింగ్ విభాగాలపై ఏసీబీ దాడులు చేసింది. ’’నేను అవినీతి కేసుల్లో తిరుగుతున్నాను అని పదేపదే అనకండి. నేను అవినీతి నిర్మూలనకే పాటుపడుతున్నాను’’ అని ప్రజలు తన అవినీతి గురించి మరిచిపోవాలని ముఖ్యమంత్రి కలలు కంటున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. సరే తన స్వార్థం కోసమే అయినా ప్రజలకు అవినీతి బాధ తప్పిస్తే అంతకుమించి కావల్సింది ఏముంది?