*వాళ్లంతా బోకులు* : కమెడియన్ అలీ బూతులు

February 23, 2020

బాగున్న సినిమాకు బాగా లేదని ఏ మీడియా రివ్యూ రాయదు. కానీ.. అదేంటో సినిమా తీయడంలో తప్పులు చేసి సినిమా వాళ్లు సినీ స‌మీక్ష‌కులపై ఏడుస్తుంటారు. ఎవరో ఒకరిద్దరు కక్షలతో రివ్యూలు రాస్తే... అందరినీ అదే గాటన కట్టడం సమంజసం కాదు. సినిమాల్లో కొందరు వ్యభిచారం చేశారని... పరిశ్రమలో అందరినీ అలా అనుకోలేం కదా. ఇదీ అంతే. ఒకరిద్దరు సమీక్షకులు ఉద్దేశపూర్వకంగా రాస్తే... నోటికొచ్చినంత మాట అనేశాడు నటుడు, కమెడియన్ అలీ. 

ఇంతవరకు ఏ తెలుగు నటుడు వాడని భాషతో రివ్యూ రైటర్లను ఏకి పడేశాడు ఆలీ. స‌మీక్ష‌కుల్ని ’’బోకులు’’ అని సంబోధించారు. కోన్ కిస్కా గొట్టం గాళ్లు అని అవమానించాడు.  ఆయనకు ఇంతకోపం ఎందుకు వచ్చిందో తెలుసా... చాన్నాళ్ల త‌ర్వాత ఆలీ చేసిన హార్ర‌ర్ కామెడీ మూవీ రాజు గారి గ‌ది-3 తాజగా విడుద‌లైంది. సినిమా బాలేదు. బోరింగ్.  రొటీన్గా, చౌక‌బారు హాస్యంతో కూడిన ఈ సినిమాకు ఆటోమేటిగ్గా తక్కువ రేటింగ్ పడింది. సినిమాను విమ‌ర్శించారు. వాటిని చదివి మండిపోయాడు ఆలీ. చాలా రోజుల తర్వాత త‌న‌కు చెప్పుకోద‌గ్గ వేషం ద‌క్కితే అది హిట్ కాలేదన్న ఫ్రస్ట్రేషన్ మొత్త సమీక్షకులపై చూపించాడు. ప్రివ్యూ షోల‌కు వెళ్తే జ‌నాలు మ‌నస్ఫూర్తిగా న‌వ్వ‌రు. ఫీలింగ్స్ దాచుకుంటారు. బ‌య‌ట థియేట‌ర్ల‌లో మాత్రం జ‌నాలు రియాక్టవుతారు. రాజు గారి గ‌ది-3 భ్ర‌మ‌రాంభ థియేట‌ర్లో చూస్తే ప్రేక్ష‌కులు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కొంద‌రు మాత్రం సినిమాలో లోపాల్ని వెత‌క‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. సినిమా బాలేద‌ని ఏవేవో కామెంట్లు చేశారు. అలా అన‌డానికి ఈ కోన్ కిస్కా గొట్టం గాళ్లు ఎవ‌రు అని అలీ సమీక్ష‌కుల్ని దుమ్మెత్తిపోశాడు. అలీ గుర్తించాల్సింది ఏంటంటే... ఈ సినిమాకు ముందు వచ్చిన రెండు పార్టులకు రైటర్లు మంచి రేటింగ్ ఇచ్చారు. దీనికి బ్యాడ్ రేటింగ్ ఇచ్చారంటే... దాని అర్థమేంటో అలీ ఆలోచించరా?