ఆంటీ కాస్తా అమ్మాయిగా మారింది

May 26, 2020

నటి అంజలి...  షాపింగ్ మాల్ సినిమాలో ఒక రా క్యారెక్టర్ తో అందరికీ పక్కింటి పిల్ల అయ్యింది. అయితే... తనకు వచ్చిన క్రేజును సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన అంజలి సాధారణ హీరోయిన్ గా మిగిలిపోయింది. పాత్రలు ఎంచుకోవడంలో గాని, తన శరీరాకృతిపై గాని పెద్ద శ్రద్ధ చూపలేదు. శ్రద్ద చూపలేదు అనడం కంటే.. ఆమె ఒక ట్రాప్ లో పడి సాధారణ అవకాశాలకు విలువైన కాలం కోల్పోయింది. అయితే...కాల క్రమేణా ఆమెకు విషయం అర్థమైనట్టుంది. అయితే, అప్పటికే ఆమె సెకండ్ గ్రేడ్ జోన్లోకి వచ్చేసింది. అంటే మొదటి గ్రేడ్ కు వెళ్లే అర్హతనే కోల్పోయింది. అందుకే బాలయ్య వెంకటేష్ వంటి ఒకప్పటి స్టార్లతో ఆమెకు అవకాశాలు వచ్చాయి గాని ప్రెజెంట్ సూపర్ స్టార్ల పక్కన ఆమెకు ఛాన్స్ రాలేదు. ఇక వచ్చే అవకాశాలు కూడా తక్కువే. దీంతో తెలుగులో స్టార్ హీరోయిన్ కాకుండా పోయినట్లే. సినిమా అవకాశాలకు కొదవ లేకపోయినా స్టార్ డమ్ రాకపోవడం స్వయంకృతాపరాధమే. 

ఇపుడు ఆమె సడెన్ గా శరీరాకృతిపై గట్టి శ్రద్ధ పెట్టినట్టుంది. అందుకే ఆంటీలా మారిన ఆమె ఆకృతిని అమ్మాయిలా మార్చుకుని మనల్ని ఇలా సర్ ప్రైజ్ చేస్తోంది. మొన్న ఫస్ట్ లుక్ చూశాం... ఇపుడు హెచ్ డీ ఫొటోలు చూడండి.