ఈ సినీ ఆంటీకి మోడ్రన్ గా కనిపించడం ఇష్టమట

August 09, 2020

రీల్ కు రియల్ కు మధ్యనున్న తేడా చెప్పాల్సిన అవసరమే లేదు. తెర మీద సెక్సీ లుక్స్ తో ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టేసి.. గిలిగింతలు పెట్టేసే నటీమణులు పలువురు తెర వెనుక అందుకు భిన్నంగా నిండైన వస్త్రధారణతో ఉంటారు. తెర మీద గ్లామర్ ఒలకబోసే అనుష్కనే ఇందుకు ఉదాహరణ. తెర మీద ఆమె ధరించే దుస్తులకు.. రియల్ లైఫ్ లో ఆమె వస్త్రధారణకు అస్సలు సంబంధమే ఉండదు.
అందరూ అనుష్కలానే ఉండరు కదా. మిగిలిన వారి సంగతేమో కానీ.. రీల్ లో తల్లి.. అత్త.. వదిన క్యారెక్టర్లతో హుందాగా.. అమాయకురాలిగా.. కనిపించే ప్రగతి మాత్రం కాస్త భిన్నమని చెబుతారు. వెండితెర మీద నిండైన వస్త్రధారణతో.. పద్దతిగా కనిపించే ఆమె.. రియల్ లైఫ్ లో మాత్రం అందుకు పూర్తి భిన్నమని చెబుతారు.
కాస్త మోడ్రన్ లుక్ తో ఆశ్చర్యపోయేలా చేస్తారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ప్రగతి.. రీల్ కు పూర్తి భిన్నమైన లుక్ లో రియల్ గా కనిపిస్తారని చెప్పాలి. తాజాగా ఆమె టాటూ వేయించుకున్నారు. భుజానికి కాస్త కిందగా వేయించుకున్న సూరీడు బొమ్మను అందరికి చూపించాలనుకున్నట్లున్నారు.
స్లీవ్ లెస్ జాకెట్ తో ఒక కార్యక్రమానికి హాజరై హడావుడి చేశారు. రీల్ కు భిన్నంగా కనిపించిన ప్రగతి ఆంటీ మీదనే చాలామంది చూపులున్నాయని చెబుతన్నారు. ఈ ఆంటీ చేసిన పనిని కొందరు ఓకే అని లైట్ తీసుకుంటే.. మరికొందరికి మాత్రం అస్సలు నచ్చలేదట. టాటూ చూపించటం కోసమే స్లీవ్ లెస్ వేసుకుందన్న వ్యాఖ్యలు పలువురి నోట వినిపించాయట.