బాపు బొమ్మ ప్రణీత... నెటిజన్స్ కుడోస్ !

August 03, 2020

మంచి మనసు అనేది జీన్స్ తో పాటు వచ్చే లక్షణం ఏమో. పబ్లిసిటీ కోసం ఎగబడేవారు ఒకవైపు... అయ్యో మన తోటి మనిషి కష్టంలో ఉన్నాడే అని బాధపడి ఆదుకునేవారు ఒకవైపు. ప్రణీత ఈ రెండో కరపు మనసున్న మనిషి. ఆమె అందచందాలు మాత్రమే ఇన్నాళ్లు చూసిన మనకు ఈరోజు ఆమె హృదయంలోని మనసును కూడా చూపించింది. సెలబ్రిటీలు... అమ్మో కావాలంటే విరాళం తీసుకోండి... మేము మాత్రం బయటకు రాము అంటే ఎవరికి తోచినంత వారు పడేశారు. 

కానీ ప్రణీత... 50 మంది పేదలకు తనకు చేతనయినంత ఆర్థిక సాయం చేసింది. కానీ అన్ని దానాల కన్నా మనిషి ఆకలి తీర్చే అన్నదానం మిన్న. అందుకే 21 రోజలు నాన్ స్టాప్ గా 75 వేల మంది ప్రతిరోజు ఆమె అన్నదానం చేసింది. తనే స్వయంగా వంట శాలలో దగ్గరుండి వంట చేయించి, ప్యాకింగ్ లో పాలు పంచుకుని... పేదలకు వడ్డించే వరకు స్వయంగా పర్యవేక్షించింది. పవన్ తో అత్తారింటికి దారేదిలో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన ఈ అమ్మాయి తాజాగా తాను చేసిన సాయంతో టాలీవుడ్లోనే నెం.1 మనుసున్న యువరాణిగా జనాలతో అభినందనలు అందుకుంటోంది.