నమ్మాల్సిందే... 100 కేజీలు బరువెత్తిన సమంత

May 24, 2020

గతంలో స్టార్లు సామాన్య మనుషుల్లాగే ఉండేవారు. కొంచెం డ్రెస్సులే విచిత్రంగా ఉండేవి. కొందరు క్రాఫ్ వరకు స్టైల్ మెయింటెన్ చేసేవారు. కానీ ఇప్పటి స్టార్లు ప్రతి పార్ట్ మెయింటైన్ చేస్తున్నారు. జుట్టు నుంచి కాలి గోటివరకు ప్రతి దానిపై శ్రద్ధ తీసుకుంటున్నారు. గ్లామర్ లో తగ్గడం లేదు. ఫిట్ నెస్ లో అశ్రద్ధ చేయడం లేదు. హీరోయిన్లు కూడా వర్కవుట్స్ చేయకుండా అసలు ఉండలేకపోతున్నారు. కెరీర్ లో చాలా కేర్ ఫుల్ గా ఉంటూ... హెల్త్ లోనూ అంతే శ్రద్ధ తీసుకుంటున్నారు.
సన్నగా ఉండే సమంత వంద కేజీలు బరువెత్తింది అంటే నమ్మగలరా? బాడీ సైజుంటే సరిపోతుందా... సత్తా ఉండాలి. ఆ సత్తాని సంపాదించింది సమంత. పెళ్లి తర్వాత కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, నాజూకైన రూపాన్ని, శారీరక దారుఢ్యాన్ని కాపాడుకునేందుకు ఆమె శ్రమిస్తోంది. వర్కవుట్స్ తో ఇప్పటికే సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది .తాజాగా 100 కిలోల బరువును సునాయాసంగా ఎత్తి ఔరా అనిపించింది. తన జిమ్ వర్కౌట్ లో భాగంగా సమంత అంత బరువును ఎత్తుతూ వ్యాయామం చేయడం ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈ వీడియోను సమంత ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయగా, అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.