అయ్యో పాపం ​శ్రీయ మొగుడు

August 13, 2020

క్వారంటైన్ లో కరోనా సెలబ్రిటీలకి, సామాన్యులకి తేడా తొలగించేసింది. చిరంజీవి చెట్లకు నీళ్లు పోస్తున్నారు. నాగార్జున ఇంటి పనులు చేసుకున్నాడు. సామాన్య భర్త ఇల్లు సర్దుతున్నాడు. మొత్తానికి అందరూ ఒకటే. ఇక తాజాగా శ్రీయ... భర్త అంట్లు తోముతు కనిపించాడు. ఈ వీడియోను ఆమే స్వయంగా షేర్ చేసింది. ఎమర్జెన్సీలో పనికొస్తాడని అన్నీ తెలిసిన భర్తను పెళ్లాడాను అంటూ శ్రీయ భర్తతో వ్యంగమాడింది.

ఆమె భర్త  రష్యాకు చెందిన ఆండ్రీ కోశ్చివ్. లాక్ డౌన్ లో పాపం అతను శ్రీయకుదొరికిపోయాడు. ఇదిగో ఈ వీడియో చూడండి. ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. విచిత్రం ఏంటంటే... ఇండియాలోనే కాదు, రష్యాలోను ఇపుడు లాక్ డౌనే నడుస్తోంది.