జగన్ పరువు గంగలో కలిసింది

February 25, 2020

ఏపీ ప్రజలకు అతిపెద్ద బ్యాడ్ న్యూస్. చంద్రబాబు హయాంలో ఏపీకి తరలిరావడానికి సిద్ధమై ఒప్పందం చేసుకున్న అతిపెద్ద పెట్టుబడి (70 వేల కోట్లు) అదానీ గ్రూప్ విరమించుకుంది. అంతర్జాతీయంగా ఏపీ రేటింగ్స్ పడిపోవడం, పారిశ్రామిక వేత్తల పట్ల జగన్ వ్యవహరిస్తున్న తీరు, పాలన పరంగా జగన్ సమర్థతను గమనించిన కంపెనీలు వేగంగా వెనుకడుగు వేస్తున్నాయి. గతంలో భారతదేశపు అతిపెద్ద ఇన్వెస్ట్ మెంట్లలో ఒకటై ఏసియన్ పేపర్ పెట్టబడి వెనక్కు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా మరో భారీ పెట్టబుడిదారు వెనక్కు తగ్గారు. దీంతో లక్షలాది ఉపాధి అవకాశాలు జగన్ పరిపాలన లోపాల వల్ల ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. 

చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు విశాఖలో పెట్టబడి పెట్టడానికి అదానీ గ్రూపు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయు కుదుర్చుకుంది. ఆ కంపెనీకి చెందిన అతిపెద్ద డేటా సెంటర్ ను విశాఖలో నెలకొల్పానుకుంది. కానీ తాజాగా దానిని విరమించుకుని తెలంగాణకు తరలిపోయింది. ఈ పరిణామంపై ఏపీ ప్రజలు కలత చెందుతున్నారు. నిత్యం మోడీకి వినయం ప్రదర్శిస్తున్నా... జగన్ ను మోడీ గాని మోడీ సన్నిహితుడు అయిన అదానీ గాని నమ్మకపోవడం విస్మయం కలిగిస్తోంది. జగన్ ప్రకటనలు, విధానాలు, రివెంజ్ పాలిటిక్స్ అభివృద్ధికి ఎంత ప్రమాదకరమో తాజా ఉదాహరణ స్పష్టం చేస్తుంది. ఈ పరిణామంతో జగన్ పరువు గంగలో కలిసినట్లయ్యింది.