సాయిరెడ్డిని వర్సెస్ ఆదిరెడ్డి భవాని !!

August 13, 2020

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి రెండే పనులు. ఒకటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని కీర్తించడం, రెండోది చంద్రబాబుని తిట్టడం. ఇదే ఆయన దినచర్య. తన వైపు తప్పులు జరిగినపుడు కళ్లు మూసుకుని కూర్చునే విజయసాయిరెడ్డి ఎదుటి వారిలో లేని తప్పులను టార్చ్ లైటు వేసుకుని వెతుకుతూ ఉంటారు. సోషల్ మీడియా ఉంది కదా అని ఎదుటి వారి వ్యక్తిగత జీవితాల్లోకి వేలు పెడుతూ ఉంటాడు. సాక్ష్యం లేకపోయినా పోలీసులు తనతో ఉన్నారన్న భరోసాతో అందిరినీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటాడు. 

అయితే... టీడీపీ నుంచి ఒక అరుదైన వ్యక్తి నుంచి సాయిరెడ్డికి ఘాటు రిప్లై వచ్చింది. సైరా పంచ్ అంటూ సాయిరెడ్డి వేసిన ట్వీటుకి కౌంటు ట్వీట్లు వేసి సాయిరెడ్డి రెండు చెంపలు వాయించినంత పని చేసింది గోదావరి జిల్లా కోడలు ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్. సాయిరెడ్డికి నోరు లేవని విధంగా చెలరేగిపోయింది.

లోకేష్ కు తెలుగు రాదు అంటూ విజయసాయిరెడ్డి లోకేష్ నారా తప్పు పలికిన కొన్ని పదాలను ఏరి ఒకపోస్టరు తయారుచేసి పోస్టు చేశారు. వాస్తవానికి జగన్ తెలుగు సరిగా మాట్లాడలేక లైవ్ ప్రెస్ మీట్లు పెట్టడం మానేశాడని తెలిసినా... తాను లోకేష్ భాష గురించి మాట్లాడితే... జగన్ రెడ్డిని అందరూ కార్నర్ చేస్తారని తెలిసినా... సాయిరెడ్డి ఈ పోస్టు పెట్టడానిని జగన్ అభిమానులే వ్యతిరేకిస్తున్నారు. ఈ పోస్టు పెట్టడం ద్వారా సాయిరెడ్డి బుక్ చేసింది లోకేష్ ని కాదని... జగన్ మోహన్ రెడ్డిని అని వైసీపీ అభిమానులు వాపోతున్నారు. 

ఇంతకీ సాయిరెడ్డి పెట్టిన పోస్టు  ఏంటి?

Image 

సాధారణంగా సాయిరెడ్డి పోస్టులను పట్టించుకోని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ తాజాగా సాయిరెడ్డి పోస్టుకు తీవ్రంగా స్పందించారు. లోకేష్ గురించి సాయిరెడ్డి మాటలు ప్రస్తావించకుండా.. జగన్ తెలుగును ఎంత దారుణంగా పలికాడో ఇంకాపెద్ద లిస్టు తయారుచేసి ఒకటికి రెండు పోస్టర్లు వదిలింది ఆదిరెడ్డి భవాని. ఈమె ఎవరో కాదు, ఎర్రన్నాయుడి కూతురే. 

ఇంతకీ ఆదిరెడ్డి భవాని పెట్టిన కౌంటర్ పోస్టులు ఏంటి?

Image

మొత్తానికి జగన్ ని తన పోస్టుల ద్వారా విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో మరింత డ్యామేజ్ చేస్తున్నారు. దానికి ఇదే ఉదాహరణ. సాయిరెడ్డి ఈ పోస్టు పెట్టకపోయి ఉంటే కచ్చితంగా వారు జగన్ గురించి దీనిని పెట్టేవారు కాదు. అంటే జగన్ కి జరిగిన డ్యామేజీకి కారణం సాయిరెడ్డి అని స్పష్టంగా తేలిపోతోంది. మరి దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటో! 

Image