అద్వానీ అరెస్టు చేసిన వ్యక్తికి మోడీ భారీ గిఫ్ట్

April 02, 2020

గుజరాత్ అల్లర్ల అనంతరం మోడీని ముఖ్యమంత్రిగా దించేయాలిన పరిస్థితి. మోడీని ఇంకా కొనసాగిస్తే బీజేపీకి చాలాచెడ్డపేరు వస్తుందని అప్పటి ప్రధాని వాజ్ పేయి ఆలోచించారు. అనేక సమాలోచనలు జరిగిన అనంతరం అతడిని తీసేస్తేనే బెటర్ అని పార్టీ ఆల్మోస్ట్ నిర్ణయించేసిన దశలో అద్వానీ రంగంలోకి దిగాడు. ఇపుడు మోడీని దించితే పార్టీ బలహీనపడుతుందని, పార్టీ మూలాలే దెబ్బతింటాయని వాజ్ పేయి మనసు మార్చాడు. ఆరోజు అద్వానీ లేకపోతే ఈరోజు ఎక్కుడుండేవాడే. సరే అలాంటి అద్వానీకి మోడీ చేసిందేంటి? షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు.

గతంలో ఒక బహిరంగ సభలో నమస్కారం పెడుతున్న అద్వానీని కనీసం పట్టించుకోకుండా అవమానించిన మోడీ, ఆ తర్వాత ఎన్నికల ముందు అద్వానీపై ప్రేమ నటించాడు. మళ్లీ గెలవగానే తన బుద్ధిని చూపించాడు. ఈరోజు మోడీతో పాటు 58 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ఒక వ్యక్తి ఎంపికతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ఎవరో తెలుసా...బీజేపీ కురు వృద్ధుడు అద్వానీని అరెస్టు చేసిన వ్యక్తి, ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ సింగ్. ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ నిర్ణ‌యం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అయింది.
యూపీఏ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ సింగ్ కేంద్ర హోంశాఖా కార్యదర్శిగా పని చేసేవారు. అపుడు బీహార్‌లోకి ఎల్.కే అద్వానీ రథయాత్ర ప్రవేశించింది. అప్పటి సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆదేశాలతో ఆ రథయాత్రను అడ్డుకున్నారు రాజ్కుమార్. అద్వానీని అరెస్ట్ చేశారు. అప్పట్లో ఇది బిగ్ బ్రేకింగ్. అసలు అది బీజేపీ గతిని మార్చిన యాత్ర. అలా అని రాజ్ కుమార్ కెరియర్ బ్యాడ్ ఏం కాదు. బీహార్ రాష్ట్రంలో అత్యంత సమర్థ ఐఏయస్ ఆఫీసర్. కాకపోతే అతనికి మంత్రి పదవి ఇవ్వడం, అద్వానీని పూర్తిగా పక్కన పెట్టడం మోడీకే చెల్లింది.