పెద్దాయ‌న మాట‌కు ట్విట్ట‌ర్ షేక్ అయ్యింది

July 01, 2020

న‌వ‌మాసాలు మోసి పెంచి పెద్ద చేసిన త‌ల్లిదండ్రుల‌ను అనాథ‌లా వ‌దిలేసిన ఒక దుర్మార్గ‌పు కొడుకులా
త‌న‌ను అంద‌రూ ప‌గ‌బ‌ట్టి ప‌ద‌వి నుంచి దించాల‌ని భావించిన‌పుడు అడ్డుకుని కాపాడిన ఒకే ఒక్క‌డిని
న‌రేంద్ర మోడీ అవ‌మానించిన తీరు ప్ర‌పంచం చూసి క‌న్నీరు పెట్టుకుంది.
ఎవ‌రో అనామ‌క వ్య‌క్తిని తీసుకువ‌చ్చి రాష్ట్రప‌తి పీఠంపై కూర్చోపెట్టే బ‌దులు అద్వానీకే ఆ స్థానం ఇచ్చిఉంటే ఈనాడు గెలుపుకోసం మోడీ ఇంత వెంప‌ర్లాడాల్సిన ప‌నిలేదు. ఎన్ని అవ‌మానాలు ఎదుర‌యినా ఆ పెద్దాయ‌న సైలెంట్ గా ఉన్నాడు. త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌క‌పోతే ఏంటి... త‌న త‌ల్లి వంటి పార్టీ బాగుంటే చాల‌ని భావించాడు. కానీ ఆయ‌న మౌనానికి విలువే లేకుండా పోయింది.
ఐదేళ్లుగా మౌనమునిలా ఉండిపోయిన బీజేపీ అగ్రనేత అద్వానీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. ఐదేళ్ల త‌ర్వాత త‌న బ్లాగులో పోస్టు రాశారు. అందులో 'మొదట దేశం... తర్వాత పార్టీ.. ఆ తర్వాతే వ్యక్తి' అంటూ అర్థం వ‌చ్చే క‌థ‌నం రాశారు. ఈ వ్యాఖ్యలు ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. మీడియాకు ప్ర‌ధాన వార్త అయ్యింది. అన్ని పార్టీల నేత‌లు ఆయ‌న‌తో ఏకీభ‌వించారు. ట్విట్టర్ లో పెద్ద‌ చర్చ న‌డుస్తోంది.
ప్ర‌స్తుతం ఆయ‌న హ్యాష్ ట్యాగ్ చాలాసేపు ఇండియా ట్రెండ్స్‌లో టాప్-3 లో నిలిచి ఉంది.